14 కోట్లను తిరస్కరించిన యువతి.. ఎందుకంటే..?

N.ANJI
సాధారణంగా డబ్బును ఇష్టపడని వారంటూ ఉండరు. ఇక నేటి పోటీ ప్రపంచంలో ప్రస్తుతం ప్రతీది పైసాతోనే నడుస్తోంది. డబ్బు సంపాదించుకోవడానికి ఎంతగానో కష్టపడుతుంటారు. మరికొంత మంది డబ్బుల కోసం ఎన్నో దారుణాలకు పాల్పడుతూ ఉంటారు. డబ్బు కోసం సైబర్ క్రైమ్, దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. ఇక డబ్బు కోసం ఎంతోమంది నేరాలకు పాల్పడుతున్న ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉంటాం.
ఇక ఫ్రీ డబ్బు వస్తుందంటే ఎవరు మాత్రం వదులుకుంటూ ఉంటారు. అలాంటి పరిణామాలు జరుగుతున్న ఈ రోజులల్లో ఓ యువతి కోట్ల రుపాయలను ఖర్చులకోసం ఇస్తుంటే సున్నితంగా తిరస్కరించింది. ఇది నమ్మలేకున్నా నమ్మాల్సిన నిజమండి. అయితే ఆమె ఎవరో. ఎందుకు కోట్ల రూపాయలను వద్దనుకొందో ఒక్కసారి చూద్దమా.
పూర్తి వివరాలల్లోకి వెళితే.. డచ్ సింహాసనం వారసురాలు నెదర్లాండ్స్ యువరాణి కాథరినా అమాలియా. ఇక ఆమెకు రానున్న భారీ వార్షిక అలవెన్స్‌ హక్కును వదులుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కింగ్‌ విల్లెం-అలెగ్జాండర్, క్వీన్ మాగ్జిమా పెద్ద కుమార్తె శుక్రవారం డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టేకు ఓ లేఖను రాసి పంపినట్లు సమాచారం.
అయితే ఆమె లేఖ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇంతకీ ఆ యువరాణి లేఖలో ఏం రాసిందే చూద్దామా. ఆమె రాజ విధులు చేపట్టే వరకు దాదాపు 2 మిలియన్ డాలర్ల భత్యాన్ని తిరస్కరించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలియజేసింది. ఇక రాచరికపు నిబంధనల ప్రకారం.. ఆమెకు 18 ఏట నుంచి ప్రతి సంవత్సరం అలవెన్స్‌ల కింద సుమారు రూ.14 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ ఏడాది డిసెంబర్ 7న అమ్మడుకు 18 ఏళ్లు రానున్నాయి. ఇక ఆమె దీనిని వద్దంటూ వివరణగా.. కష్ట పడకుండా వచ్చే డబ్బులు తనకొద్దని తెలియజేసింది. ఇక చిన్న వయస్సులోనే ఆమెకు ఉన్న మెచ్యురిటిని చూసి అందరు ఆశ్చర్యనికి గురి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: