కోట్ల ఫ్యామిలీ రూట్ మారుస్తుందా?

M N Amaleswara rao

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి...ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన నేత. దివంగత కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన సూర్య ప్రకాశ్...కాంగ్రెస్ పార్టీ తరుపున తొలిసారి 1991లో కర్నూలు ఎంపీగా విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచిన సూర్యప్రకాశ్...కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.


ఇక 2014లో రాష్ట్ర విభజన కావడంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి దారుణంగా తయారైంది. అయినా సరే అదే పార్టీ నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి కోట్ల ఓటమి పాలయ్యారు. అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ పరిస్తితి మరీ దారుణంగా తయారవ్వడంతో కోట్ల 2019 ఎన్నికల ముందు ఫ్యామిలీతో కలిసి కాంగ్రెస్‌ని వదిలేసి టీడీపీలోకి వచ్చేశారు.


టీడీపీలోకి వచ్చాక కోట్ల కర్నూలు ఎంపీగా పోటీ చేయగా, ఆయన సతీమణి సుజాతమ్మ ఆలూరు అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. అయితే జగన్ వేవ్‌లో ఇద్దరు దారుణంగా ఓడిపోయారు. ఓడిపోయాక పార్టీలో పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. ఏదో అప్పుడప్పుడు పార్టీలో కనిపిస్తున్నారు తప్ప, పూర్తి స్థాయిలో పార్టీ తరుపున నిలబడిన సందర్భాలు తక్కువ. అయితే కర్నూలు పార్లమెంట్ పరిధిలో కంటే ఆలూరు అసెంబ్లీ స్థానంలో సుజాతమ్మ గట్టిగానే ఫైట్ చేస్తూ వచ్చారు. మంత్రి గుమ్మనూరు జయరాంపై అనేక అవినీతి ఆరోపణలు చేశారు. అలాగే ఆయన భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు. అయితే ఈ విధంగా ఫైట్ చేస్తూ వచ్చిన సుజాతమ్మ ఈ మధ్య సైలెంట్ అయిపోయారు.


అటు కోట్ల సైతం పార్టీలో పెద్దగా కనిపించడం లేదు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో వీరు టీడీపీ తరుపున బరిలో దిగితే గెలవడం కష్టమని తెలుస్తోంది. ఎందుకంటే కర్నూలు జిల్లాలో వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే కర్నూలులో వైసీపీ వేవ్ ఉంది. ఇక 2019 ఎన్నికల్లో ఏమి జరిగిందో చెప్పాల్సిన పని లేదు. ఈ పరిస్తితిని బట్టి చూస్తే నెక్స్ట్ కోట్ల ఫ్యామిలీకి గెలుపు అంత సులువు కాదని తెలుస్తోంది. అందుకే కోట్ల ఫ్యామిలీ టీడీపీలో సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.


అసలు 2019 ఎన్నికల ముందే కోట్ల ఫ్యామిలీ వైసీపీలోకి వెళ్లడానికి ప్రయత్నించింది. కానీ అప్పుడు టీడీపీ అధికారంలో ఉండటంతో కోట్ల ఫ్యామిలీ చంద్రబాబు చెంత చేరింది. కానీ ఊహించని విధంగా ఓటమి పాలైంది. అక్కడ నుంచి టీడీపీలో బలపడలేదు. దీని బట్టి చూస్తే కోట్ల ఫ్యామిలీ రూట్ మారకపోతే రాజకీయ భవిష్యత్ కష్టమని అర్ధమవుతుంది. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో కోట్ల ఫ్యామిలీ రూట్ మారుస్తుందో లేక టీడీపీలోనే నిలబడుతుందో?

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: