దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ 2019లో రెండో సారి కూడా అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయం పక్కన పెడితే.. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే దానిపై ఇండియా టుడే ఓ సర్వేను నిర్వహించింది. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట ఇండియా టుడే ఈ సర్వేను నిర్వహించింది. అయితే ఈ సర్వేలో మళ్లీ ఎన్డీఏనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ఫలితం వచ్చింది.
ఇండియా టుడే సర్వే ప్రకారం.. దేశంలో ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి 321 స్థానాలు వస్తాయి. మరోపక్క యూపీయే కూటమికి కేవలం 93 స్థానాలు మాత్రమే వస్తాయని సర్వే ద్వారా వెల్లడైంది. ఈ రెండు కూటములు కాకుండా మిగతా వారికి 129 స్థానాలు లభించే అవకాశం ఉన్నట్టు సర్వే పేర్కొంది. ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 43 శాతం ఓట్లు, యూపీఏకు 27 శాతం ఓట్లు, ఇతరులకు 30 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చెప్పుకొచ్చింది. ఈ ఏడాది జనవరి 3వ తేదీ నుంచి జనవరి 13 వరకు సర్వేను ఇండియా టుడే నిర్వహించినట్టు తెలిపింది. మొత్తంగా 12,232 మందిని ఫోన్ ద్వారా, ముఖాముఖి పద్దతుల్లో ఇంటర్వ్యూ చేసినట్టు సర్వే నిర్వాహకులు చెప్పారు.
మొత్తంగా 97 పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని ప్రజలను ఇంటర్వ్యూ చేసినట్టు పేర్కొన్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా అక్కడ విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా దేశంలోని అనేక రాష్ట్రల్లో బీజేపీ నెం.1 పార్టీగా ఉంది. గత లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 45 శాతం ఓట్లు దక్కాయి. అయితే తాజా సర్వే ప్రకారం 43 శాతం ఓట్లు రానున్నట్టు తేలింది. అంటే.. దేశ ప్రజల్లో ఎన్డీఏ పట్ల ఎటువంటి వ్యతిరేకత ఏర్పడలేదని స్పష్టంగా అర్థమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: