అయ్య బాబోయ్..! నిమ్మగడ్డ దూకుడు మామూలుగా లేదండోయ్ ?

గత కొంత కాలంగా ఏపీ అధికార పార్టీ వైసిపికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య చోటుచేసుకుంటున్న వివాదాలు సెగలు పుట్టిస్తునే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే విషయంలో ఈ రెండు వ్యవస్థల మధ్య వివాదం ఏర్పడింది. అది కాస్త కోర్టు వరకు వెళ్ళింది. కొద్దిరోజుల క్రితమే ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేయడంతో, ఈ వ్యవహారం పై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై సింగిల్ బెంచ్ జడ్జి ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వగా , దీనిపై ఎన్నికల కమిషన్ పిటిషన్ వేయడంతో హై కోర్ట్ ఏపీ ప్రభుత్వం వాదనలతో ఏకీభవించలేదు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రజారోగ్యం రెండు ముఖ్యనేనని కోర్టు వ్యాఖ్యానించింది. 




ఎన్నికల కమిషన్ కు అనుకూలంగా తీర్పు రావడంతో ఇప్పుడు ఆగమేఘాల మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల పై దూకుడు పెంచారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని,  ఇక ప్రభుత్వ అధికారులు ఎవరు ప్రభుత్వ పథకాల ప్రచారాల్లో , కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ముందుగా ప్రకటించిన నాలుగు విడతల్లో ఎన్నికలు నోటిఫికేషన్ ప్రక్రియ యధావిధిగా కొనసాగుతుందని ప్రకటన కూడా విడుదల చేశారు.5,9,13,17 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. అలాగే ఎన్నికల కమిషన్ చీఫ్ సెక్రటరీ , కలెక్టర్లు , ఎస్పి ల తో పాటు కీలక అధికారులు అందరితోనూ త్వరలోనే సమావేశాన్ని నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు.




అలాగే ఎన్నికల నిర్వహణ సందర్భంగా ప్రజలకు ఎన్నికల సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భద్రతాపరమైన అన్ని చర్యలు, కోవిడ్ నిబంధనలు.. ఇలా అన్నిటిపైనా సమీక్ష చేపట్టారు. ఏది ఏమైనా తన పదవీకాలం ముగిసే లోపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి  తీరాలనే పట్టుదలతో శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: