ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

NAGARJUNA NAKKA
అంతరిక్షంలో  సూర్యగ్రహణం కనువిందు చేసింది. ఈ ఏడాది చివరలో రెండో సూర్యగ్రహణం సంభవించింది. రాత్రి 7గంటల 3 నిముషాలకు ప్రారంభమైన సూర్య గ్రహణం, అర్థరాత్రి 12 గంటల 23 నిముషాలకు ముగిసింది.  అయితే ఈ సూర్యగ్రహణం మనదేశంలో కనిపించలేదు. దక్షిణ అమెరికా, నైరుతి ఆఫ్రికా, అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణాన్ని ఏర్పడింది.
ఈ ఏడాదిలోని చివరి సూర్య గ్రహణం కనువిందు చేసింది. అయితే ఇది భారత్ లో ఇది కనిపించలేదు. ఈ సంవత్సరం మొత్తం ఆరు గ్రహణాలు ఏర్పడ్డాయి. వీటిలో నాలుగు చంద్ర గ్రహణాలు... రెండు సూర్య గ్రహణాలు.  రాత్రి 7.03 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12.23 గంటలకు ఉంది. రాత్రి 8.02 నిమిషాలకు సంపూర్ణ సూర్యగ్రహణం ప్రారంభమై రాత్రి 9.43గంటలకు పూర్తిస్థాయిలో సూర్యగ్రహణం ఏర్పడింది. మనదేశంలో సూర్యాస్తమయం అయిపోయింది కాబట్టి  ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల వారు దీన్నిచూడగలిగారు.
ఈ సంవత్సరం జూన్ 21, 2020న మొదటి సూర్యగ్రహణం సంభవించగా.. చివరి సూర్యగ్రహణం నిన్ననే ఏర్పడింది. ఏడాది చివరలో వచ్చిన ఈ సూర్య గ్రహణం భారత్ లో ఐదు గంటలపాటు ఉంది. వాయిస్- పసిఫిక్ మహా సముద్రం, అంటార్కిటికా, దక్షిణ అమెరికాలోని దక్షిణ ప్రాంతాల్లో పాక్షికంగా కనిపించింది ఈ సూర్యగ్రహణం. చిలీలోని శాంటియాగో, బ్రెజిల్ లోని సావోపాలో, అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్, పెరూలోని లిమా, ఉరుగ్వేలోని మాంటెవీడియో, పరాగ్వేలోని అసున్సియన్ ప్రాంతాల్లోనూ ఏర్పడింది.
ఈ గ్రహణం వృశ్చిక, మిథున రాశులలో సంభవించింది. భారత్‌లో గ్రహణం కనిపించనందున ఇక్కడ దీని ప్రభావం ఏమీ చూపలేదు. ఈ గ్రహణం ఈ రోజు సాయంత్రం 7 గంటల 3 నిముషాలకు మొదలై, రాత్రి 12 గంటల 23 నిముషాల వరకు ఉండనుంది. ఇక 2021లో మొదటి సూర్యగ్రహణం జూన్ 10న ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఉత్తర కెనడా, గ్రీన్ ల్యాండ్, రష్యాలలో కనిపించనుంది. భారత్‌లో పాక్షికంగా కనిపించనుంది. 2021లో రెండో సూర్యగ్రహణం డిసెంబరు 4న ఏర్పడనుంది. ఇది అంటార్కిటికా, దక్షిణ ఆఫ్రికా, అట్లాంటిక్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలలో కనిపించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: