మీ దగ్గర ఏ.టి.ఎం కార్డ్ ఉందా .... అయితే 1 వ తారీకు నుండి మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ ..ఎందుకో తెలుసా ..?

Kunchala Govind

ఏ చిన్నా చితకా వ్యాపారం లేదా ఉధ్యీగం చేసే మినిషికైనా బ్యాంక్ అకౌంట్ ఉందంటే.. డెబిట్ కార్డు కచ్చితంగా ఉంటుంది. బ్యాంకులు ఖాతా ప్రారంభించిన వారికి డెబిట్ కార్డులు జారీ చేస్తాయి. ఈ డెబిట్ కార్డులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో చెల్లింపులు, ఏటీఎం క్యాష్ విత్‌డ్రా ఇలా ఎన్నో రకాల ట్రాన్సాక్షన్లను డెబిట్‌ కార్డు ద్వారా ఉపయోగించవచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ కస్టమర్లకు భారీ ఝలక్ తప్పేలా లేదు. బ్యాంక్ అకౌంట్‌ను ఎక్కువ కాలంపాటు ఉపయోగించకపోతే.. అప్పుడు ఆ అకౌంట్‌కు డెబిట్ కార్డులు జారీ నిలిచిపోయే అవకాశముంది. అంటే ముందుగానే డెబిట్ కార్డు ఉంటే.. వీటికి మళ్లీ రెన్యూవల్ అంటూ ఉండదు.
బ్యాంకులు వ్యయాలను తగ్గించుకోవడానికి, అలాగే మోసాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తాజా సమాచారం. ప్రముఖ జాతీయ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ విషయం వెల్లడైంది. 

 

డార్మెంట్ అకౌంట్లకు సేవలు అందించాల్సిన అవసరం లేదని బ్యాంకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు జాబ్ మారేటప్పుడు కొత్త అకౌంట్‌ను ఓపెన్ చేస్తుంటారు. దీన్ని శాలరీ అకౌంట్‌గా ఉపయోగిస్తారు. అప్పుడు పాత కంపెనీలోని అకౌంట్లు నిరుపయోగంగా మారతాయి. దీంంతో అవి డార్మెంట్ అకౌంట్లుగా మారతాయి. వీటికి కూడా డెబిట్ కార్డులు పనిచేయకపోవచ్చు. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సేవలను లాంచ్ చేశారు. అయితే జీరో బ్యాలెన్స్ అకౌంట్లు కూడా చాలా వరకు కొంత కాలం తర్వాత ఏ మాత్రం ఉపయోగం లేకుండా మారిపోతున్నాయి. వీటిల్లో ఎలాంటి ట్రాన్సాక్షన్లు ఉండటం లేదు. దీంతో అవి కూడా డార్మెంట్ అకౌంట్లుగా మారిపోతున్నాయి. ఈ అకౌంట్లకు కూడా డెబిట్ కార్డ్ సేవలు అందుబాటులో ఉండకపోవచ్చు. 

 

అంటే పూర్తిగా నిలివేస్తారు. మరోవైపు దేశంలో డెబిట్ కార్డుల జారీ తగ్గినా కూడా జన్ ధన్ అకౌంట్ల వినియోగం నానాటికీ పెరిగిపోతూ వస్తోంది. పేద ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఈ తరహా అకౌంట్ సేవలు పొందుతున్నాయి. జన్ ధన్ అకౌంట్ ఉన్న వారికి రూపే కార్డును అందజేస్తారు. జన్ ధన్ అకౌంట్ల కారణంగా రూపే కార్డుల జారీ వార్షిక ప్రాతిపదికన 13.5 శాతం పెరుగుదలతో 29.68 కోట్లకు పెరిగింది. దేశంలో డెబిట్ కార్డుల సంఖ్య ఏడాదిలోనే రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. 2018 అక్టోబర్‌లో సర్క్యులేషన్‌లో ఉన్న డెబిట్ కార్డులు 99.8 కోట్లుగా ఉన్నాయి. 2019 అక్టోబర్ నాటికి ఈ సంఖ్య 15 శాతం తగ్గుదలతో 84.3 కోట్లకు క్షీణించింది. ఈఎంవీ కార్డుల అప్‌గ్రడేషన్ వల్ల కార్డుల సంఖ్య 15.5 కోట్లు తగ్గిందని బ్యాంకులు పేర్కొంటున్నాయి. దీన్ని బట్టి చూస్తే డెబిట్ కార్డులు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాల్సి ఉందని తెలుస్తోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: