నాడు కమిటై అన్నీపొందిన వాళ్ళే - నేడు # Me Too అంటున్నారట-బ్లాక్ మెయిలింగ్ కాదా!


ఎంటర్టైన్మెంట్  అడ్వర్టైజ్మెంట్ రంగంలో స్త్రీ పురుషులు సాధారణంగా సన్నిహితం గా మెలిగే సందర్భాలే ఎక్కువ. వేళ పాళా లేని పని వేళలు కొత్త ప్లేసెస్ లో పని చేయ వలసి రావచ్చు. అమ్మాయిలు తమ రక్షణ తామే చూసుకోవాలి. దానికి స్త్రీల కోసమే స్త్రీ పక్షపాతిగా బ్రతికి వారి మనసులో మిగిలిపోయిన విఖ్యాత స్త్రీవాద రచయిత-గుడిపాటి వెంకటచలం స్త్రీలు ఏలా పురుషులతో ప్రవర్తించా లో చక్కగా వివరించారు


*స్త్రీ ఒక మాటవల్లా, చూపువల్లా పురుషునికి సందిచ్చిందా!  ఇక అతని అధికారానికీ, కోరికలకీ, విన్నపాలకీ అంతం ఉండదు.  ఆ పర్యవసానం అక్కర్లేని స్త్రీ మొదటి నించి విముఖంగానే ఉండాలి. నిప్పువలె ఉండాలి*


అలా ఉంటున్నారా? మగువలు - అలా కాని నాడు #MeToo తప్పవనిపిస్తుంది. తనపై అత్యాచారం ఆరోపణలు చేసిన ఒక మోడల్ గురించి కుండ బద్ధలు కొట్టినట్టుగా మాట్లాడు తున్నాడు క్రిస్టియానో రొనాల్డో. ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న ఈ ఫుట్ బాల్ స్టార్ పై అత్యాచారం ఆరోపణలు చేసింది ఒక మోడల్. ఆమె కోర్టుకు కూడా ఎక్కింది.


అయితే ఈ విషయంపై రొనాల్డో ఒకటే మాటే చెబుతున్నాడు. ఆమె ముందుగా కమిట్ అయ్యిందని, తామిద్దరం ఇష్ట పూర్వకంగానే సెక్స్ లో పాల్గొన్నామని, ఇప్పుడు మాత్రం ఆమె మాట మార్చి అత్యాచారం అని అంటోందనేది రొనాల్డో వాదన.


కోర్టులో రొనాల్డో న్యాయవాది ఇదే వాదనే వినిపిస్తున్నాడు. ఇలాంటి వివాదాలు ఏమీకాదు. ఆ మధ్య వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజ్ విషయంలోనూ ఇదే జరిగింది. అతడిని ప్రభుత్వాలే ఇరికించాయి. ముందస్తుగా అతడితో కమిట్ అయిన ఆడవాళ్లు ఆ తర్వాత అత్యాచారం ఆరోపణలు చేశారు. ఈ వివాదంతోనే అసాంజ్ కొన్ని సంవత్సరాలుగా యూకే లోని రాయబార కార్యాలయంలో బందీ అయిపోయాడు. ఆరేడేళ్లుగా ఒకే ఇంటికి పరిమితం అయిపోయాడు . బయటకు వస్తే అరెస్టు చేయడానికి బ్రిటన్ పోలీసులు అన్ని సంవత్సరాలుగా బయట కూర్చుని ఉన్నారు.


ఇక బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ పై ఆరోపణలు చేస్తున్న అతడి అసిస్టెంట్ వాదనలో కూడా కొంత డొల్ల ఉంది.


అదేమిటంటే, అతడి దగ్గర పనిచేయడానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లినప్పుడే “స్వయంతృప్తి పొందుతావా? వారానికి ఎన్నిసార్లు?” అనే ప్రశ్నను అడిగాడని ఆమె చెబు తోంది. ఆ తర్వాత తను చేరాక కూడా వేధింపులను కొనసాగించాడని అంటోంది. ఇక్కడ ఆమె చెబుతున్న మాటల్లోనే తేడా ఉంది.


అదేమిటంటే, ఇంటర్వ్యూ సమయంలోనే అతడు వెకిలి ప్రశ్నలు వేషాలు వేశాడని చెబుతున్నఈమె మళ్లీ అతడి దగ్గర ఎందుకు చేరినట్టు? అనేది ప్రశ్న. తీరేంటో అక్కడే అర్థమయ్యాక కూడా అతడి దగ్గరే అసిస్టెంట్ గా చేరాల్సిన అవసరం ఏముంది? అతడి లైంగికంగా వేధిస్తున్నా అతడి దగ్గరే పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాదానాలు ఖచ్చితంగా లభించవు.


అప్పుడు అవసరం కొద్దీ చేశానని ఆమె అంటే, అప్పుడు తప్పు ఎవరిది అవుతుంది? సందడిలో సడేమియా! అన్నట్టుగా కొంతమంది ఇప్పుడు రెచ్చిపోతూ ఉండవచ్చు. కొందరు నిజమైన బాధితులు కూడా ఉండవచ్చు. వీరితో పాటు కమిట్ అయినంత కాలం, కమిట్ అయ్యి ఇప్పుడు Me-too అంటున్న వాళ్లకూ కొదవలేక పోవచ్చు! పై సంఘటనలు అవగాహనకు వచ్చిన తరవాత Me-too అనే వాటిని అంత తేలిగ్గా ఎలా నమ్మాలి? ఆయా రంగాల్లో శృంగార అవసరాలు తీర్చుకునే చాలా సంఘటనలు అతిసునాయాసంగా జరిగుతాయి అనేది జనాల్లో ప్రచారంలో ఉండేదే. అందుకే అన్నీ సంఘటనలు Me-too కావు అలాగే కొన్ని Me-too కూడా అయి ఉండవచ్చు.


అందరూ దొంగలే, అన్న విషయంలో సందేహం ఉన్నా, దొరికినోళ్లు మాత్రమే నిందల పాలవుతారు. బాలీవుడ్ సర్కిల్స్ లో రేగిన ఈ తుఫాన్ ను పరిశీలిస్తే ఈ విషయం ఇంకా స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకూ ఈ వివాదం సుడిలో చిక్కుకున్నవాళ్లు కొందరే. ఇంకా ఈ వ్యవహారం ఇప్పుడప్పుడే ముగియదని, కొన్నినెలల పాటు ఈ వ్యవహారం సీరియల్ లా కొనసాగే అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు.


ఇలాంటి వ్యవహారాలు ఇది వరకూ వెలుగులోకి వచ్చినప్పుడు అంత తేలికగా సమిసిపోలేదు. ఛాలా రాద్ధాంతాలుగానే నిలిచాయి. ఇప్పుడూ అదే జరుగు తోంది. కొనదు మాత్రమే నాడు స్పందించారు. ఇప్పుడు ఒకరిద్దరు కాదు. వేలం వెర్రిలాగా చాలామంది స్పందిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులపైనే ఈ వివాదాలు రేగాయి కాబట్టి ఇవి సంచలనం అవుతున్నాయి.


అయితే ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఈ వ్యవహారాలు మరికొన్ని వెలుగులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. Me-too వ్యవహారంలో అమితాబ్ బచ్చన్ కే వార్నింగ్ ఇచ్చేంత స్థాయిలోకి వెళ్లారు నటీ మణులు. కాబట్టి, ఇవి ఇంకా మరిన్ని చెలరేగి సంచలనాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టే.


ఇక ఈ వ్యవహారంలో ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రముఖులు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. వీరిలో ఒకరైన సుభాష్ ఘయ్ అయితే, పరువు నష్టం దావా వేస్తున్నట్లు హెచ్చరిక చేశాడు. ఈ ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకునిపై పై అత్యాచారం ఆరోపణలు చేసింది ఒక తార. ఇలాంటి నేపథ్యంలో సుభాష్ స్పందిస్తూ చట్టపరంగా నిరూపించకపోతే, చట్టపరమైన చర్యలకు సిద్ధమై  ఉండాలని అన్నాడు.


ఇక సాజిద్ ఖాన్ కూడా కేవలం నిందితుడినే, దోషిని కాను, అంటున్నాడు. అప్పుడే తన విషయంలో తీర్పులివ్వొద్దని అంటున్నాడు. ఇలా సాగుతోంది ఈ వ్యవహారం. ఇక ఈ వ్యవహారం సోషల్ మీడియా నెటిజన్లకు మంచి మసాలాతో దంచి వినోదాన్ని కాని ఖర్చు లేకుండానే దొరుకుతుంది. బాలీవుడ్ మీడియా కూడా ఈ శృంగార వివాదాల తో నిండుగా పండగ చేసుకుంటోంది. ఎంచక్కా తోచిన తీర్పులు ఇస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: