తెలంగాణా శాసనసభ రద్ధు ప్రతిపాదన గవర్నర్ ఆమోదం - ఒక వ్యక్తి అత్మహత్యాయత్నం

తెలంగాణ శాసనసభను రద్దు చేస్తూ మంత్రిమండలి తీర్మానం చేసింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం నాడు ప్రగతిభవన్ లో జరిగిన  కేబినెట్ సమావేశం ఈ మేరకు  అసెంబ్లీని రద్దు చేయాలని  తీర్మానం చేసింది.



తెలంగాణ ముఖ్యమంత్రిగా కలవకుంట్ల చంద్రశేఖర రావు 2014 జూన్ 2వ తేదీన ప్రమాణం చేశారు. నేటికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 1546 రోజులపాటు పాలనకొన  సాగించాడు.అంటే సుమారు 4 ఏళ్ల మూడు మాసాల 4 రోజుల పాటు సీఎంగా కొనసాగారు. అంటే ఇంకో తొమ్మిది నెలల కాలం మిగిలి ఉండగానే ముందస్తు ఎన్నికలకు అవకాశమిస్తూ శాసనసభను రద్ధుచేసారు. 



తెలంగాణలో ప్రస్తుతము తమకున్న  అనుకూల రాజకీయ పరిస్థితుల కారణంగానే "ముందస్తు ఎన్నికలు" కు వెళ్లాలని భావిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు తమ అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తన సహా మంత్రులంతా రాజ్ భవన్ కు చేరుకొన్నారు. రాజ్ భవన్ లో కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ తో సమావేశమై తన మంత్రిమండలి ఆమోదించిన శాసనసభ రద్దు ప్రతిని గవర్నర్ కు అందించనున్నారు. అది జరిగితే తెలంగాణా శాసనసభ రద్ధు అమలులోకి వస్తుంది.


తెలంగాణా కాబినెట్ తీర్మానానికి గవర్నర్ ఆమోద ముద్ర పడింది.
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కెసిఆర్ కొనసాగేందుకు గవర్నర్ యిచ్చిన అవకాశాన్ని మన్నించారు.





తెలంగాణ అసెంబ్లీ రద్దు వార్తలతో ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది. కేసీఆర్ గవర్నర్‌ను కలిసేందుకు వస్తుండటంతో రాజ్‌భవన్ పరిసరప్రాంతాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా పోలీసుల, మీడియా సిబ్బంది అలర్ట్‌ గా ఉన్న సమయంలో ఆకస్మాత్తుగా ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.



వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అతని పేరు ఈశ్వర్‌ గా తెలిపాడు. తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు చేసిందేమి లేదని హామీలు నెరవేర్చకుండా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నా డని అతను ప్రశ్నించాడు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: