ఆనం కు ఇంకా హామీ రాలేదు... అందుకే జగన్ చుట్టూ తిరుగుతున్నాడు..!

Prathap Kaluva

ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్ లో ఎన్నో గొప్ప గొప్ప పదవులు మోసి చివరికు ఎటు కాకుండా పోయినాడని చెప్పాలి. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ పాతాళానికీ పోయింది. దానితో ఆ పార్టీ లో ఉన్న కొంత మంది నాయకులూ కూడా పార్టీ లు మారి తమ రాజకీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. అయితే ఆనం ఇప్పటి వరకు  టీడీపీ లో ఉన్న పార్టీ లో తగినంత గౌరవం రాలేదని పార్టీ మారడానికి సిద్ధం అయిపోయాడు. 


ఇప్పటికే రెండుసార్లు రామనారాయణ వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. అయితే ఆ భేటీ తర్వాత ఇరువర్గాలూ ఎక్కడా పెదవి విప్పలేదు. టీడీపీకి గుడ్ బై చెబుతాడన్న సంకేతాలున్నాయి కానీ, వైసీపీలో ఎప్పుడు అధికారికంగా చేరతాడన్న దానిపై స్పష్టత లేదు. తాజాగా లోటస్ పాండ్ లో మరోసారి వైఎస్ జగన్ ని కలశారు ఆనం రామనారాయణ రెడ్డి. ఈసారి కూడా చేరిక మహూర్తం ఖరారు కాలేదు.


ఆనం చేరిక లాంఛనమే అయినా ఏ నియోజకవర్గం ఇవ్వాలనే అంశంపై స్పష్టత రాలేదని తెలుస్తోంది. రామనారాయణ రెడ్డి మాత్రం తనకు ఆత్మకూరు కావాలని కోరుతున్నారు. అయితే ఆత్మకూరులో జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన మేకపాటి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. గౌతమ్ రెడ్డిని కాదని ఆనంకు అది కేటాయించే ఛాన్స్ లేదు. మరోవైపు గౌతమ్ రెడ్డి కూడా తాను వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నుంచే  పోటీచేస్తానని ప్రకటించారు. సరిగ్గా అదేరోజు జగన్ ని శంషాబాద్ విమానాశ్రయంలో రామనారాయణ రెడ్డి కలిశారు. ఆత్మకూరు కాకుంటే వెంకటగిరిని రామనారాయణ రెడ్డికి కేటాయించే అవకాశముంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: