జగన్ వద్దకు దూసుకొచ్చిన టీడీపీ కార్యకర్త, ఏం చేసాడంటే..

Prathap Kaluva
ప్రజాసంకల్ప యాత్ర పేరుతో జగన్ చేస్తున్న పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం నియోజకవర్గంలో ఆయన తన పాదయాత్రను కొనసాగిస్తున్నాడు. అయితే నర్సాపురం నియోజకవర్గంలోని కొప్పర్రు నుండి  లిఖితపూడి, సరిపల్లి మీదుగా పాదయాత్ర చేస్తున్న 176వ రోజు జగన్ కు ఒక వింత అనుభవం ఎదురయింది. జగన్ దగ్గరకు దూసుకవచ్చిన ఒక యువకుడు తాను టీడీపీ కార్యకర్తనంటూ పరిచయం చేసుకోవడం అక్కడున్న వారిని నిర్ఘాంతపోయేలా చేసింది.


జగన్ చుట్టూ పగడ్బంధీగా ఉన్న సెక్యూరిటీని తప్పించుకొని మురళీ కృష్ణ అనే యువకుడు జగన్ వద్దకు దూసుకవచ్చాడు. అయితే అతను చేసిన పనికి కంగారుపడ్డ భద్రతా సిబ్బంది అతన్ని పక్కకులాగే ప్రయత్నం చేసారు. అయితే అతను ఎందుకలా చేసాడో వివరణ ఇచ్చుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తాను టీడీపీ  కార్యకర్తనని చెప్పిన యువకుడు, అందుకు ఐడి ప్రూఫ్ ను కూడా చూపించాడు. తన సొంతవూరు విజయవాడ అని, ప్రస్తుతం భీమవరంలోని బంధువుల జ్యూస్‌ షాప్‌లో పనిచేస్తున్నానని చెప్పాడు.


ఈ పాటికి చదువుకు తగ్గ ఉద్యోగం చేయాల్సిన తాను కేవలం చంద్రబాబు ఫలితం మూలంగానే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానని గోడును వెళ్లబోసుకున్నాడు. మొదటి నుండి టీడీపీకీ పనిచేస్తూ ఉండటం వల్ల టీడీపీ నాయకులు ఏదో ఒక ఉద్యోగం ఇస్తారని ఆశపడితే, తీరా మూడు లక్షలు ఇస్తే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లోనో, మంగళగిరి రిజిస్ట్రేషన్‌ ఆఫీసులోనో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారని తన ఆవేదనను వ్యక్తపరిచాడు. దీంతో జగన్ కలుగజేసుకొని వైసీపీ అధికారంలోకి వస్తే తనలాంటి వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: