అప్పుడలా! ఇప్పుడిలా! ఏంది బాబూ! నీ గోల! హోదానా? పాకేజీనా? అని బిజెపి బేజారైతే!

ఆసేతు సీతాచలంలో నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ అనుభవమున్న ఏకైక రాజకీయనాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు నాయకత్వం  లోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్రానికి "ప్రత్యేక హోదా" పై మరోసారి తింగిరి పని చేసింది. 

గతంలో "ప్రత్యేక హోదా" ఏమాత్రం సంజీవని కాదని దానికి బదులు  "ప్రత్యేక ప్యాకేజీ" సర్వరోగ నివారని అంటూ మరీ మరీ బాగుందంటూ, ఏకంగా నిండు శాసనసభ సాక్షి గా ఎదురులేని తీర్మానం చేసిన టిడిపి ప్రభుత్వం ఇప్పుడు "ప్రత్యేక హోదా" మాత్రమే సంజీవని సర్వరోగ నివారణి అన్ టూ అదే కావాలంటూ మరల అదే శాసనసభ సాక్షి గా మరోసారి తీర్మానం చేసింది. 

"ప్రత్యేక హోదా" తో సహా విభజన హామీలనన్నింటినీ కేంద్రం లోని తమ మిత్ర పక్షం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ మంగళవారం అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన పోరాటాన్ని బహు ముఖంగా ముమ్మరం చేసిన ఈ తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారి అపారానుభవమున్న ప్రభుత్వం ప్రత్యేక హోదా పై ఈమేరకు "యూటర్న్‌" తీసుకుంది.

గతంలో "ప్రత్యేక హోదా" కంటే "ప్రత్యేక్ ప్యాకేజీ" గొప్పదని అందుకే దానిని అంగీకరించామంటూ అటు ప్రధాని నరెంద్ర మోదీకి, ఇటు ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి తమ హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ శాసనసభలో అనుభవశీలి చంద్రబాబు నాయకత్వ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఆ విషయాన్ని, గతంలో ప్రత్యేక ప్యాకేజీ గురించి అపార అనుభవమున్న అధినేత  "గోరంతలు కొండంతలు" చేసి చెప్పిన గొప్పలను నిస్సంకోచంగా నిశ్శిగ్గుగా మరిచిపోవటం టీడీపీకే చెల్లింది. 

ఇప్పటివరకు ప్రతిపక్ష నేత పట్టువదలని విక్రమార్కునిలా ప్రజల మనసుల నుండి చెరిగిపోకుండా బ్రతికిస్తూ పెంచి పోషించి మాహా వృక్షంగా నిలిపిన ప్రత్యేక హోదా ప్రజల మనసుల్లో విశ్వరూపం దాల్చింది. అందుకే టిడిపి ప్లేట్ ఫిరాయించి "తనకు తానే బూమరాంగ్ అవుతూ" గోస, ఆయాస పడుతూ సిగ్గు విడిచి మళ్ళీ ప్రత్యేక హోదా అనే మాటను ఎత్తుకుంది.

ప్రతిపక్ష నాయకుని ప్రోత్సాహంతో ఇప్పటికే ప్రత్యేక హోదా సాధనకు ప్రజలు మానసికంగా ఆందోళనలకు సిద్ధమవుతుండటం,  ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో వైఎస్‌ఆర్‌సీపీ పోరాటాలను తీవ్రతరం చేసిన నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం అపార అనుభవఙ్జులు చంద్ర బాబు గారి నాయకత్వంలోని టిడిపి ప్రభుత్వం దిక్కులేని పరిస్థితుల్లో ఈ తీర్మానం చేసిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఇలాంటప్పుడు ఆంధ్ర ప్రజలపై అంత మమతానురాగాలుంటే - రాగద్వేషాలు వదిలేసి "వైసిపి నేత" ను చంద్రబాబు గారు ఆహం వదలి, అదీ ఆయన అమితంగా ప్రేమించే తెలుగు ప్రజలకోసం, అనుసరిస్తే ఆయన సుధీర్గ అపార అనుభవం తోడైతే ...... నరెంద్ర మోడీ దిగి రాడా? అంటున్నారు అంధ్రా జనావళి.  లేకపోతే ఈ తీర్మానాల ప్రతులతో కన్-ఫ్యూజై  "హోదానా? పాకేజీనా?"    "టు బి? ఆర్ నాట్ టు బి?" అని  కంగారుపడ్డ హంలెట్ లాగా బిజెపి బేజారైతే?  మొత్తానికే నరెంద్ర మోడీ ముసలం తెచ్చి ప్రజల కొంప ముంచేలా చేస్తే?
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: