మన భూమిపై గ్రహాంతర వాసులు ఉన్నారా..ఉంటే అవి మనిషిని పోలిన విధంగా ఉన్నాయా..లేదా ఏవైనా వింత జంతువుల్లా ఉన్నాయా అన్న అనుమానాలు ఎప్పటి నుంచి ఉన్నాయి. కాకపోతే వాటిపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక అప్పుడప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఎలియన్స్ వచ్చాయని..కనిపించాయని జనాలు ఊదరగొడుతుంటారు.
ఆ మద్య విశాఖలో వింత పక్షులు వచ్చాయని..అవి ఏలియన్స్ లా ఉన్నాయని తెగ హంగామా చేశారు. తీరా చూస్తే అవి గుడ్లగూబ జాతికి చెందినవి అని చెప్పడంతో ఆ మ్యాటర్ కి శుభం కార్డు పడింది. తాజాగా విశాఖలో మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఫోటోలో చేతులు, ఉదరభాగం అచ్చం మనిషిని పోలి ఉన్నాయి. రెండు చేతులు వెనక్కి కట్టేసి ఉంచారు. అచ్చం మనిషిని పోలినట్లు ఉన్న ఈ వింత చేప ఫోటోలు నిజమైనవో? గ్రాఫిక్స్‌లో చేసినవో? తేలాల్సి ఉంది.
కాకపోతే వీడియోలో ఆ వింత చేప ప్రాణాలతోనే ఉన్నట్లు కినిపిస్తోంది. నిజంగానే ఇది విశాఖ తీరంలోనే దొరికిందా లేదా ఎక్కడి వీడియోనో ఇక్కడ వైరల్ చేస్తున్నారో? క్లారిటీ రావాల్సి ఉంది.