మన బాబులకు, రావులకు, మోడీలకు ట్రంప్ ని తిట్టే అర్హతుందా?



పాపాల ఫంకిలం గా మారిన తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్త్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిశ్చయం గా కుల పక్షపాతే. అంతేకాదు ఆశ్రిత పక్షపాతికూడా! తన కులస్తులు నేరగాళ్ళుగా పట్టుబడితే నష్టపోయిన వాళ్ళు అత్యంత దీనావస్థకు పడిపోయినా ఆయనకు దయాదాక్షిణ్యాలు కనికరం అనేవి ఉండనే ఉండవు. అలాగే కేసిఆర్ కుల మత ప్రాతిపదికపై బడ్జెట్ లో ఫండ్ అలకేషణ్లు చూస్తుంటే మనకున్న జాతి మత కుల వివక్ష అన్ని అంశాల్లో బహిర్గతమౌతూనే ఉంటుంది. అలాంటి భారత్ కు ట్రంప్ నాయకత్వం లోని అమెరికా చేసే జాత్యహంకార దురంతాలను ప్రశ్నించే హక్కును కోల్పోతుంది.




అంతేకాదు తెలంగాణా ఉద్యమ సమయంలో మన తెలుగు సోదరులైన ఆంధ్రులనే ప్రాంతీయ దురభిమానంతో దూరం పెట్టిన కేసిఆర్ ట్రంప్ కంటే గొప్పవారా! అయితే ఎలా? రాష్ట్రం విడిపోయాక ఆయన పాలనా తీరంతా కుల, మత, ప్రాంత పరంగానే నడుస్తుంది. అలాగే చంద్రబాబు భయానకమై 11 మందిని పొట్టన పెట్టుకున్న దివాకర్ ట్రావెల్స్ తాగుబోతు డ్రైవరు ను తప్పించి ఆ ట్రావెల్స్ పై కేసే లేకుండా చేసిన అనైతికత ఆశ్రితులనేకదా? యాజమాన్యం తన పార్టీ వారనే కదా? దీన్నే అహంకారమంటారు?  




ఈ మధ్యనే భారత పార్లమెంటులో కొంతమంది ఎంపీలు రెచ్చిపోయారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇష్టానుసారం మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై వీరు విరుచుకుపడ్డారు. ట్రంప్ వల్ల అమెరికాలో జాతి విధ్వేషదాడులు జరుగుతున్నాయని, ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికన్లలో విధ్వేషం పొంగి పొర్లిపో తోందని, జాత్యహంకారంతో అమెరికన్లు భారతీయులను హత్యలు చేస్తున్నారని, తన ప్రసంగాల్లో ట్రంప్ ఇండియన్స్ పై విషం కక్కాడని, ఇలా సాగాయి వీళ్ల ప్రసంగ పాఠాలు. అమెరికా జాతీయవాది అయిన ట్రంప్ విషయంలో మనోళ్లు ఎలాటి కళలు పడుతున్నారో? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో?  అందరికీ తెలిసిందే.





మరి దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఒక రాష్ట్రానికి యోగీ ఆదిత్యనాథ్ ను సీఎంగా చేసింది భారతీయ జనతా పార్టీ. ఆయన ఎమ్మెల్యే కాకపోయినా లోక్-సభ నుంచి తెచ్చి ముఖ్యమంత్రిగా చేసింది. ఈ విషయంలో బీజేపీకి సర్వ స్వతంత్రం ఉండ వచ్చు గాక! ఇప్పుడు ఇండియన్స్ కోల్పోయే హక్కేమిటంటే ట్రంప్ వంటి వాళ్లను తిట్టే హక్కు. ట్రంప్ తో పోలిస్తే ఈ యోగీ ఆదిత్యనాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అత్యంత తీవ్రమైనవి.




సూర్య నమస్కారాలు చేయకపోతే పాకిస్తాన్ వెళ్లిపోవాలి.  తొంభై శాతం హిందువులకే సూర్య నమస్కారం ఎలా చేయలో తెలి యదు. చేసే తీరికా లేదు. షారూక్ ఖాన్ కు హఫీజ్ సయీద్ కు తేడా లేదు. చెప్పుకొంటూ పోతే ఇలాంటి వ్యాఖ్యలు బోలెడు. ఒకే మాటలో  చెప్పాలంటే ఈ ఆదిత్యనాథ్ అలియాస్ అజయ్ సింగ్ హిందు అతివాది. తన మాటలతో మంటలు పుట్టించిన వ్యక్తి. 




మరి అమెరికాలో జాతి, యూపీలో మతం అంతే తేడా. మిగతాదంతా  “సేమ్ టూ సేమ్”  ఈ నేపథ్యంలో, ట్రంప్ నోటిని, అతడి విధానాలను విమర్శించే అర్హత భారతీయులకు పూర్తిగా పోయింది. అయినా, ఆవు మాంసం తిన్నాడ న్న అనుమానంతోనే ఒక వ్యక్తి ప్రాణాలు తీసిన జాతి వారికి, అమెరికాలో మనోళ్లను కాల్చి చంపితే ఆక్రోశించే హక్కు ఎక్కడిది?   అదెప్పుడో హారతి కర్పూరం అయిపోయిందిగా! ట్రంప్ లాంటి కంపు గాళ్ళని కూడా ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నారు మన సిగ్గుమాలిన ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేని భారతీయ రాజకీయవేత్తలు.  


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: