డెక్కన్ క్రానికల్ ఛైర్మన్ పై కేసు

 హైదరాబాద్: ఆంధ్రభూమి దినపత్రిక, డెక్కన్ క్రానికల్ గ్రూపుల ఛైర్మన్ తిక్కవరపు వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదైంది. వాణిజ్య ఒప్పందాలు ఉల్లంఘనకు పాల్పడ్డట్లు అభియోగాలు రావడంతో సీసీఎస్ లో ఛీటింగ్ కేసు నమోదైంది. దక్షిణ భారత దేశంలోనే తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న డెక్కన్ క్రానికల్ ఆంగ్ల దినపత్రిక నష్టాల ఊబిలో కూరుకుపోయింది. నష్టాల నుంచి గట్టెక్కడానికి గానూ 54శాతం పెట్టుబడులను ఫ్యూచర్ క్యాపిటల్ హెల్డింగ్ సంస్థకు కుదువ పెట్టినట్లు సమాచారం. డెక్కన్ క్రానికల్ సంస్థల అధినేత వెంకట్రామిరెడ్డి ఫోర్జరీ పత్రాలతో తమల్ని మోసగించాడనీ కార్వీ అనే సంస్థ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వాణిజ్య ఒప్పందాన్ని అతిక్రమించి డెక్కన్ క్రానికల్ హెల్డింగ్స్ లిమిటెడ్ మోసానికి పాల్పడినట్లు కార్వీ అనే సంస్థ ప్రతినిధులు కేసు పెట్టారు. దీనితో సీసీఎస్లో వెంకట్రామిరెడ్డిపై ఐపీసీ సెక్షన్ 420, 468, 406, 471 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. డెక్కన్ క్రానికల్ ఛైర్మన్ మోసాలకు పాల్పడినట్లు పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ లో ఈ మేరకు కేసు నమోదైంది. ప్రస్తుతం డెక్కన్ క్రానికల్ గ్రూపు పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. నిండా నష్టాల ఊబిలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ నడవడం కష్టమేననీ జోరుగా ప్రచారం జరుగుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: