ఆమె ఎవరు?


పి వి సింధు, సాక్షి మాలిక్ విజయాల వార్తాప్రవాహాల వెల్లువలో కొట్టుకు పోతున్నాం. అయితే ఒక్క సారి ఈ ఉరవడికి బ్రేక్-వేసి ఒక్క క్షణం జరిగేది పరిశీలిద్ధాం. వాళ్ళ ఆటతీరు కాదు, వాళ్ళ గురించికాదు.


మన ఇద్దరు చంద్రుల రాజకీయ రసమయ విన్యాసాల గురించి. మా స్నెహితుడొకరు గూగిల్ లో సింధు కులం సెర్చ్ చేస్తుంటే ఎందుకు ఆమె ఇండియన్ అనుకుంటే సరిపోతుంది లేదా నీ కూతురు లాంటిది అనుకుంటే సరిపోతుందిగా అన్నాను. వాడి సమాధానం విని నామైండ్ బ్లాంక్ అయింది. అదేమంటే:


"సింధు ఆంధ్రా అమ్మాయి అంటూ 3 కోట్ల రూపాయీల నగదు బహుమతి,  అమరావతిలో 1000 గజాల విలువైన స్థలం, గ్రూప్ 1 ఉద్యోగం యివ్వటానికి కాబినెట్ అంగీకారం తీసుకున్నారు చంద్రబాబు.


సింధు  "బొనమేత్తింది" ఆమె తండ్రి రమణ  ఆదిలాబాద్ జిల్లాలో పుట్టారు.  ఆమె హైదరాబాద్ లోనే చదువుకున్నారు. గోపీచంద్ పర్య వేక్షణలో అధ్లెట్ అయ్యారు. కాబట్టి ఆమె తెలంగాణా బిడ్డ అంటూ ఆమెకు కలవకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణా ముఖ్యమంత్రి కాబినెట్ మీటింగ్ పెట్టి మరీ 5 కోట్ల రూపాయీల నజరానా, గ్రూప్ 1 ఉద్యోగం, 1000 చదరపు గజాల గృహ నిర్మాణానికి స్థలం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.


సింధు తండ్రి పి వి రమణ, తెలంగాణా - ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ వాసి, తల్లి పి విజయ ఆంధ్రప్రదేశ్ - విజయవాడ లో జన్మించారు. వీరిద్దరూ తమిళనాడ్ రాజధాని చెన్నై లో స్పోర్ట్స్ మెన్-గా  ఎదిగారు. జన్మతః సింధు హైదరాబాద్ లో జన్మించింది. ఇక్కడే విద్య, ప్రముఖంగా గోపీచంద్ బాడ్మింటన్ స్టేడియంలో అధ్లెట్ గా రూపుదిద్దుకున్నారు. తల్లి తండ్రులు వాలీబాల్ ప్లేయర్స్.  అయితే సింధు బాడ్మింటన్ ప్లేయర్ గా అటు తల్లితండ్రులు  గురువు గోపీచంద్ సం-రక్షణలో అద్భుత మైన అధ్లెట్ గా రజత పథకం సాధించారు.


ఇక ఆమె ఎవరు?  బాబు రెచ్చిపోయారు ఆంధ్రా (కమ్మా-కాదా!) నా?   జనాలకి సత్యనాదేళ్ళ కథ గుర్తొచ్చిందట.  అందుకే జనాలకు విపరీత అనుమానం. కమ్మనా? కాదా? అని. విజయ గారు నిష్కర్ష గా చెపారు ఆమె.సింధు. ఇండియన్ అని. అమ్మయ్య అనుకొన్నాం? బాబు కనిపిస్తే, మాట్లాడిటే ఇలాంటి విషయాల్లో కులం గుర్తుకువస్తుంది. అదీ ప్రకటించిన నజరానా విలువ చూసి. 


ఇక కెసిఆర్,  సిబిఎన్ క్రెడిట్ ఎక్కడ కొట్టేస్తాడోనని,  భగభగ మండి "ఆమె భోనం పట్టింది"  కాబట్టి తెలంగాణా కు చెందినదని ముందు ప్రకటించిన కోటి రూపాయల నజరానా ను, మరల అద్భుతంగా కెటిఆర్ వ్యూహంతో మార్చేశారు. ఆమె తెలంగాణా?  తెలంగాణావాళ్ళకి అంత కులగుల ఉండదు కాని ఎందుకైనా మంచిదని కులమేమిటా? 


తల్లిదండ్రులు తమిళనాడులో అభివృద్ది చెందటం వల్లె ఆయమ్మాయిని అధ్లెట్ చెయగలిగారని ఆమె "తమిళియన్"  అని ఇంకా జయలలిత  "ఓన్"  చేసుకోవలసి ఉంది. అని వెతికా అంతే. బాబులు ఆ గుల, యావ  యెక్కువ కాబట్టి కాస్త ఉత్సుకత కలిగింది అని ముగించాడు"


పై ఇద్దరిలా  "ముదురు మోడీ"  ఓన్ -చేసుకోలేడు కాని ఆయన భారత ప్రధాని నమో! అందుకే   ఆమె "సింధు" - (భారత్ చారిత్రాత్మకంగా సింధూ నదీ - పరీవాహ ప్రాంతం చుట్టూ రూపుదిద్ధుకుంది)  అలా 'సిందూదేశం'  క్రమేణా కాలక్రమంలో.... హిందూదేశం గా మారింది. అందుకే ఆయన ఆమె  ఇండియన్ బై నేం &  బర్త్ - అని "చారిత్రాత్మకంగా హిందూ" అని "ఓన్" చేసుకున్నారు  మోడీనా? మజాకానా? దుకే ఆయన 2 కోట్ల రూపాయల కానుకను ప్రకటించారు దేశ గౌరవం నిలబెట్టి నందుకు.


ఒక అమ్మాయి సాధించిన విజయాన్ని విజయం గా చూడక" బేనియత్"  తో ఆ విజయాన్ని రాష్టాల  పరంగా లేదా మావాడు అనుకుంటున్నట్లు  "కులం" పరంగా ప్రాంత పరంగా  చూసే ముఖ్యమంత్రులు రాజకీయనాయకులు ఈ రాష్ట్రాల కవసరమా? "ప్రతిభ ఒకడబ్బ సొత్తుకాదు,  మత, కుల, ప్రాంతం అలాంటి విభజనకు అందనిది" . హాట్స్ ఆఫ్ సింధు....హాట్స్ ఆఫ్ ప్రతిభ" 


డియర్ సిఎంస్ ప్లీజ్ సింప్లి షట్ యువర్ టక్టిక్స్ - డు ది బెస్ట్ టు ది అధ్లెట్స్ - దట్ ఎనేబుల్ దెం టు డు బెటర్ - బెటర్ పర్ఫార్మన్స్"  ...రాజకీయాలొద్దు ప్లీజ్!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: