“ఎన్నారైల పాలసీ” కోసం...

Bhavannarayana Nch

ప్రవాస భారతీయుల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వారి సంక్షేమం దిశగా కృషి చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోవడం లేదని తక్షణమే ప్రవాసీయుల కోసం ప్రత్యేక పాలసీని ఏర్పాటు చేసి 500 కోట్ల రూపాయలను కేటాయించాలని..గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణదోనికేని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రత్యేక ఎన్నారై పాలసీని ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించిందని ఇంత వరకు ఆచరణలోకి రాలేదని ఆయన ఆరోపించారు. వివరాలోకి వెళ్తే..

 

ఎన్నారై పాలసీని ఏర్పాటు చేయాలనీ కోరుతూ ఆదివారం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు..ఈ సందర్భంగా..కృష్ణదోనికేని మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఎన్‌ఆర్‌ఐ పాలసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప జేయాలని కోరారు. ఎన్‌ఆర్‌ఐ పాలసీ  ఈ ప్రభుత్వం కునుకా రూపొందిస్తే తెలంగాణకు చెందిన ప్రవాసభారతీయులు ఎదుర్కొంటున్న వెంటనే పరిష్కారం అవుతాయని అన్నారు..

 

ఎంతో మంది గల్ఫ్ కార్మికులు గడిచిన నాలుగేళ్ళలో మరణిచారని అయితే మరణించిన వారి కుటుంభాలకి కూడా ఈ పాలసీ అమలు జరిగే విధంగా రూపొందించాలని డిమాండ్‌ చేశారు. 15 సంవత్సరాల పాటు విదేశాల్లో ఉండి తిరిగి స్వస్థలాలకు వచ్చిన తెలంగాణ కార్మికులకు జీవిత భీమాతో పాటు పించన్‌ కూడా ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. తెలంగాణ  ఎన్‌ఆర్‌ఐ పాలసీని రూపొందించాలని కోరుతూ లక్ష సంతకాల సేకరణ చేపట్టామని అన్నారు ఈ నెల లో లక్ష సంతకాలని మంత్రులకి అందజేస్తామని తెలిపారు....ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ పాలసీ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు..

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: