ఇరాక్ లో సంచలన చట్టం.. ఆడపిల్లలంటే ఆట బొమ్మలేనా?

praveen
ఒకప్పుడు ఆడవాళ్లు అంటే కేవలం వంటింటి కుందేళ్లు మాత్రమే. మగాళ్లకు వంట చేయడానికి.. పడక సుఖం ఇవ్వడానికి మాత్రమే ఆడవాళ్ళ పుట్టుక ఉంది అన్న విధంగా వ్యవహరించే వారు మనుషులు. కానీ ఇటీవల కాలంలో ఇలాంటి తీరు మారింది. ఒకప్పుడు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అయిన ఆడవాళ్లు ఇక ఇప్పుడు పురుషులతో సమానంగానే అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు. మహిళా సాధికారత వైపుగా ప్రతి ఒక్కరు కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇంకా కొన్ని దేశాల్లో ఆడవాళ్లపై వివక్ష కొనసాగుతూనే ఉంది.

 ఆఫ్ఘనిస్తాన్ లో అటు తాళిబన్ల పాలన వచ్చిన నాటి నుంచి కూడా పూర్తిగా ప్రజాస్వామ్యం కనుమరుగయ్యింది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు స్వేచ్ఛగా చదువులు వ్యాపారాలు ఆటల్లో పురుషులతో పోటీపడిన అమ్మాయిలు.. ఇక ఇప్పుడు మళ్లీ ఆ దేశంలో వంటింటి కుందేళ్లుగా మారిపోయారు. కనీసం చదువుకోవడానికి కూడా వీలు లేని విధంగా అక్కడి చట్టాలను రూపొందించారు తాలిబన్లు .అయితే ఇరాక్ లో కూడా ఇలాంటి దారుణమైన చట్టాలను తీసుకువచ్చారు అనేది తెలుస్తోంది.

 ఈ క్రమం లోనే ఇరాక్ లో ఇటీవల తీసుకు వచ్చిన ఒక కొత్త చట్టం గురించి తెలిసి ప్రపంచమే నివ్వెర పోతుంది. పర్సనల్ లా చట్టాన్ని సవరించేందుకు ఇరాక్ పార్లమెంట్ సిద్ధం అవ్వడంపై హక్కుల సంఘాలు బగ్గు మంటున్నాయి. సవరణకు ఆమోదం లభిస్తే అమ్మాయిల పెళ్లి వయస్సు ఏకంగా 9 ఏళ్లకు తగ్గిపోతుంది. విడాకులు, పిల్లల కస్టడీ, వారసత్వ ఆస్తిపై కూడా అటు మహిళలు హక్కును కోల్పోతారు. ఇది చైల్డ్ సెక్స్ ని చట్టబద్ధం చేయలేమని.. అదే సమయంలో మహిళల పరిస్థితి దారుణంగా మారిపోతుందని ప్రపంచం ఈ చట్టంపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయినప్పటికీ ఇరాక్ ప్రభుత్వం వెనక్కి తగ్గేలా మాత్రం కనిపించడం లేదు. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: