మహిళను ప్రెగ్నెంట్ చేసిన పిల్లి.. నిజం బయటపెట్టిన భర్త?

praveen
నేటిరోజుల్లో టెక్నాలజీ కారణంగా అన్ని పనులు ఎంతో సులభతరం అయిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచాన్ని చుట్టేయడం కూడా ఎంతో ఈజీగా మారిపోయింది. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో కూర్చున్న చోటు నుంచే ప్రపంచాన్ని చుట్టేయగలుగుతున్నాడు మనిషి. ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగిన కూడా ఇట్టే తెలుసుకోగలుగుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చే ఎన్నో ఆసక్తికర ఘటనల గురించి తెలిసి ఆశ్చర్య పోవడం ఇక ఇంటర్నెట్ జనాల వంతు అవుతూ ఉంటుంది.

 ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక ఆశ్చర్యకరమైన ఘటన గురించే. ఏకంగా ఇక్కడ ఒక వ్యక్తి తన భార్య గర్భవతి అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. కానీ అతను చెప్పిన నమ్మలేని నిజాన్ని గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు  ఎందుకంటే తన భార్యని తన పెంపుడు పిల్లి గర్భవతిని  చేసింది అంటూ అతను చెప్పిన విషయం నమశక్యంగా లేక.. ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేసింది. కానీ ఆ తర్వాత దీనిపై అతను వివరణ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయినా రెడ్డిట్ లో ఒక వ్యక్తి తన భార్య గర్భవతి అనే సమాచారాన్ని అందరితో పంచుకున్నాడు. అయితే పెంపుడు పిల్లి తన భార్యను ప్రెగ్నెంట్ చేసింది అంట చెప్పాడు. అప్పటికే ఒక బిడ్డ ఉన్న ఈ దంపతులు మరో బిడ్డను కనేందుకు ప్లాన్ చేశారు. అయితే ఓ రోజు భార్య గర్భవతి అయింది. అంతకుముందు గర్భ నిరోధక మాత్రలు వేసుకునేది సదరు మహిళ. కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండడంతో కండోమ్స్ వాడటం మొదలుపెట్టారు. ఇలా కండోమ్స్ వాడినప్పటికీ భార్య గర్భవతి కావడం చూసి షాక్ అయ్యాడు భర్త. తర్వాత కండోమ్ ప్యాకెట్ తీసి చూసి అసలు విషయం తెలిసింది. ఎందుకంటే పెంపుడు పెళ్లి కండోమ్ ప్యాకెట్లు అన్నింటినీ కూడా తిన్నది. ఈ విషయాన్ని దంపతులు గమనించలేదు  ఆ విధంగా బొక్క పడిన కండోమ్స్ వాడటంతో.. చివరికి మహిళ గర్భం దాల్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు సదరు వ్యక్తి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: