పుట్టుకతోనే 32 పళ్లు.. చిన్నారి ఎలా నవ్వుతుందో చూడండి?
ఇక ఇలాంటి తరహా ఘటనల గురించి తెలిసి వామ్మో సినిమాల్లోనే అనుకున్నాం. కానీ రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతాయా అని ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే అని చెప్పాలి. మొన్నటికి మొన్న ఏకంగా ఒక శిశువు తోకతో పుట్టిన ఘటన అందరిని షాక్ కి గురిచేసింది. ఇక ఇప్పుడు ఒక శిశువు ఏకంగా పుట్టుకతోనే 32 పళ్ళతో పుట్టింది. సాధారణంగా మనిషికి 18 ఏళ్ల వయసు తర్వాతే 32 పళ్ళు వస్తాయి. అయితే చిన్నారులు మాత్రం ఇక అప్పుడప్పుడే పళ్ళు వస్తు చిరునవ్వులతో కనిపిస్తూ ఉంటారు.
కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఒక శిశువు పుట్టుకతోనే 32 పళ్ళతో జన్మించింది. దీంతో ఇది చూసి డాక్టర్లు సైతం షాక్ కి గురయ్యారు. నాటల్ టీత్ అనే అరుదైన ఆరోగ్య పరిస్థితితో ఇలా జరిగినట్లు డాక్టర్లు చెప్పుకొచ్చారు. అయితే ఇలా 32 పళ్లతో పుట్టిన శిశువుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా పుట్టుకతోనే పళ్ళు రావడం కారణంగా బిడ్డకు ఏం ప్రమాదం లేదని.. కానీ పాలు ఇచ్చేటప్పుడు తల్లికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో పన్ను విరిగిపోతే ఇక శిశువు మింగే ప్రమాదం ఉంది అని భావించి ఆ పళ్ళను తొలగించారు.