బంపర్ ఆఫర్.. బిడ్డను కంటే రూ. 92 వేలు.. ఇక్కడంటే?

frame బంపర్ ఆఫర్.. బిడ్డను కంటే రూ. 92 వేలు.. ఇక్కడంటే?

praveen
ఇండియాలో జనాభా రోజురోజుకు పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పిల్లలు కనడంపై ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అవగాహన చర్యలు చేపడుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు అనే వారు. కానీ ఇప్పుడు ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అని వరకు వచ్చింది పరిస్థితి. అయితే మన దేశంలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇతర దేశాలలో మాత్రం జననాల రేటు అంతకంతకు తగ్గిపోతుంది.

 దీంతో ఆయా దేశాలు ప్రమాదంలో పడిపోతూ ఉన్నాయి అని చెప్పాలి. వృద్ధుల సంఖ్య పెరిగిపోతూ ఉండడం అటు జనాల రేటు తగ్గిపోవడం కారణంగా యువకుల సంఖ్య కూడా తగ్గిపోతూ ఉండడం జరుగుతుంది. దీంతో కొన్ని దేశాలలో ఏకంగా పిల్లలను కంటే భారీగా నగదు నజరాణాలు కూడా ప్రకటిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా బిడ్డను కంటే 92,000 ఇవ్వడానికి సిద్ధమైంది ప్రభుత్వం. వామ్మో 92 వేలా.. ఎక్కడ ఇలాంటి బంపర్ ఆఫర్ ప్రకటించారు అని అనుకుంటున్నారు కదా.

 ఇది మనదేశంలో కాదులేండి.. రష్యాలో. సంతానోత్పత్తిని పెంచడానికి రష్యాలోని కరేలియా అధికారులు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. 25 ఏళ్లలోపు యువతులు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తే ఏకంగా 92 వేల రూపాయలు బహుమతిగా ఇస్తాము అంటూ ప్రకటన చేశారు. ఈ స్కీం 2025 జనవరి 1 నుండి అమలులోకి రాబోతుందట. ఇప్పటికే ఆ దేశంలో కండోమ్లు, గర్భనిరోధక మాత్రలపై కూడా నిషేధం విధించారు. ఇలా చేయడం ద్వారా సంతానోత్పత్తి పెరుగుతుందని అధికారులు భావించారు. అయితే రష్యా దేశంలోని ప్రతి మహిళ ఏకంగా 8 మందికి జన్మనివ్వాలి అంటూ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ విజ్ఞప్తి కూడా చేశారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: