చేతులు కలిపిన చైనా - రష్యా.. ఏం జరగబోతుందో?

praveen
భారత పొరుగు దేశమైన చైనా చేసే పనులు ఎప్పుడూ ప్రపంచ దేశాలని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలి అనే ఆశపడే చైనా దీనికోసం ఎన్ని దొడ్డదారులు తొక్కడానికైనా సిద్ధమైపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న అమెరికాను దాటేందుకు చైనా ఎన్నో రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీనికోసం ఏకంగా కొన్ని కొన్ని సార్లు ప్రపంచ వినాశనానికి కూడా సిద్ధమవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇలాంటి ఆలోచనతోనే చైనా గతంలో కరోనా వైరస్ అనే ఒక మహమ్మారి వైరస్ ను కనిపెట్టి అది ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెంది ఏకంగా ప్రకంపనలు సృష్టించేలా చేసింది.

 ఇంకొన్నిసార్లు ఏకంగా ఇతర దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తూ ఉంటుంది. మరి కొన్నిసార్లు ఇక ఇతర దేశాలకు ఆర్థిక సహాయం చేస్తూ ఆయా దేశాలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. భారతదేశానికి మరో వైపున ఉన్న పాకిస్తాన్ ను కూడా ఇలా ఆర్థిక సహాయం చేసి అప్పులు తీర్చలేని సమయంలో చెప్పు చేతుల్లో పెట్టుకుని అన్న విషయం తెలిసిందే. అలా ఎప్పుడూ తమ ఎదుగుదల కోసం దొడ్డదారులు తొక్కే చైనా ఇక ఇప్పుడు ఒక ప్రమాదకరమైన దేశంతో చేతులు కలిపింది. ఇది కాస్త ప్రపంచ దేశాలలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా రష్యాతో సంబంధాలను మరింత బలపరుచుకునేందుకు సిద్ధమైంది చైనా.

 రష్యాతో తమ బంధం మునుపెన్నడూ లేనంత బలంగా ఉంది అంటూ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇటీవల పేర్కొన్నారు. కజకిస్తాన్ లో జరుగుతున్న షాంగై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా ఇలా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుతిన్ తన పాత స్నేహితుడిగా జింపింగ్ అభివర్ణించారు. అంతర్జాతీయ పరిస్థితులు  కుదుపులకు లోన్ అవుతున్న నేపథ్యంలో పరిస్థితులను అదుపులో ఉంచేందుకు ఇక ఇరుదేశాలు పరస్పర సహకారం అందించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు అన్నది తెలుస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ శక్తి కలిగిన రష్యాతో ఇప్పుడు చైనా చేతులు కలిపిన నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితులు ఎక్కడ వరకు దారితీస్తాయి అనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: