ఓరినాయనో.. వాయు కాలుష్యంతో రోజుకు ఇంతమంది చనిపోతున్నారా?
ఇంకోవైపు వాహనాల సంఖ్య పెరిగిపోవడం.. ఇక కంపెనీలు పెరిగిపోయి కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతూ ఉండడంతో.. వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అని చెప్పాలి. ఇలా పెరిగిపోతున్న వాయు కాలుష్యం ఇక రోజురోజుకు మనిషి మనుగడకు ప్రమాదకరంగా మారిపోతుంది అని చెప్పాలి. కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే కనీసం స్వచ్ఛమైన గాలి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఇక పరిస్థితి ఇలాగే కొనసాగితే మనిషి ఆక్సిజన్ సిలిండర్ ను వెనకబెట్టుకొని తిరగడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి వస్తుందని నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు.
అయితే ఇలా ప్రపంచ దేశాలలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం కారణంగా రోజుకు ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు అన్న విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోతున్నారు. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య సమస్యతో రోజుకి 2000 మంది చిన్నారులు మరణిస్తున్నారని యుఎస్- హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఇటీవల నివేదికలో పేర్కొంది. 2021 లో వాయు కాలుష్యంతో 81 లక్షల మంది మరణించినట్లు తెలిపింది. రక్తపోటు తర్వాత వాయు కాలుష్యం కారణంగానే అధికమరణాలు చోటు చేసుకుంటున్నాయి అంటూ వెల్లడించింది. దీనిని నియంత్రించకపోతే వచ్చే జనరేషన్ పై ఎంతగానో ప్రభావం పడే అవకాశం ఉంది అంటూ తెలిపింది. సదరు నివేదిక.