రైలు టికెట్ ధర రూ.4.5 లక్షలు.. స్పెషల్ ఏంటంటే?

praveen
ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే రవాణా వ్యవస్థగా కొనసాగుతున్న భారత్ లో ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు రైల్వే మార్గం ద్వారా ప్రయాణాలను సాగిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది జీవితాలలో ఇలా రైల్వే ప్రయాణం ఒక భాగంగా మారిపోయింది. కొన్నిచోట్ల ప్రజలు ఎలా అయితే ఆర్టీసీ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు చేరుకుంటు ఉంటారో ఇక మరికొన్ని ప్రాంతాలలో జనాలు ఇలాగే ప్రతిరోజు లోకల్ ట్రైన్లలో ప్రయాణిస్తూ ఉంటారు.

 సుదూర ప్రాంతాలకు వెళ్లాలి అనుకున్న వారు కూడా ఎక్కువగా రైలు ప్రయాణాన్ని ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సురక్షితమైన ప్రయాణంతో పాటు అతి తక్కువ ఖర్చుతో  కూడిన ప్రయాణం రైల్వేలో అందుబాటులో ఉంటుంది. అందుకే ఇక ప్రతి ఒక్కరు కూడా రైలు మార్గం ద్వారానే తమ ప్రయాణాలను సాగిస్తూ ఉంటారు. అయితే ఇలా ఇప్పటివరకు రైలులో ప్రయాణం కి అయ్యే ఖర్చు చాలా తక్కువ ఉంటుందని మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఇక్కడ మాత్రం ఒక రైలు టికెట్ ధర 4.5 లక్షలు అన్న విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి.

 ఈ రైలు పేరు సెవెన్ స్టోర్స్ ఆఫ్ క్యూషూ. రెండు రోజుల్లో 3000 కిలోమీటర్ల పరిధిలో తిరిగే ఈ రైలు టికెట్ ధర అక్షరాల ఒక 4. 5 లక్షల రూపాయలు.  ఈ తొలి లగ్జరీ రైలుని జపాన్ లో ప్రారంభించారు. అగ్నిపర్వతాలు సముద్రాలు ప్రకృతి సౌందర్యాలను తిప్పి చూపిస్తుంది ఈ రైలు. ఇక లోపల కూడా సెవెన్ స్టార్ హోటల్ ను తలపించే సౌకర్యాలు ఉంటాయట. అందుకే ఇంత పెద్ద మొత్తంలో టికెట్ ధర ఉన్న ఎంతోమంది ఈ రైలులో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఇదే ఈ రైలు యొక్క ప్రత్యేకత అన్నది తెలుస్తుంది. భారత్లోనూ ఇదే తరహాలో మహారాజా రైలును అందుబాటులోకి తీసుకువచ్చారు అన్న విషయం తెలిసిందే . ఇలా మహారాజా ఎక్స్ ప్రెస్ రైలు అనేక పర్యాటక ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకువెళ్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: