వామ్మో.. ఇక నుంచి ఆ దేశంలో సిగరెట్ తాగొచ్చు?

praveen
ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం  ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఈ అలవాట్లను మానడానికి మాత్రం పెద్దగా ఎవరు ఆసక్తి కనపరచడం లేదు. రోజు రోజుకు ధూమపానం, మద్యపానం చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది తప్ప.. ఈ అలవాటు నుంచి బయటపడే వారి సంఖ్య మాత్రం ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల కాలంలో అయితే మద్యపానం కంటే ఎక్కువగా ధూమపానం చేసేవారు పెరిగిపోతున్నారు  చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా సిగరెట్ కి బానిసలుగా మారిపోతున్నారు.

 అయితే పొగాకు కారణంగా చివరికి క్యాన్సర్ వస్తుంది అని తెలిసినప్పటికీ కూడా ఎవరు పెద్దగా.. లెక్క చేయడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని దేశాలలో ఇలా పొగాకు వినియోగం అంతకంతకు పెరిగిపోయిన నేపథ్యంలో.. ఏకంగా పొగాకు పై నిషేధం విధించడం లాంటివి కూడా జరిగాయి. అయితే ఇక న్యూజిలాండ్ దేశంలో కూడా ఇలాగే ఎన్నో ఏళ్లనుంచి పొగాకుపై నిషేధం కొనసాగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఏకంగా ఏళ్ల నాటి నుంచి కొనసాగుతూ వస్తున్న నిషేధాన్ని ఎత్తివేసేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది అన్నది తెలుస్తుంది.

 పొగాకు నిషేధంపై ఉన్న చట్టాన్ని న్యూజిలాండ్ ప్రభుత్వం రద్దు చేయబోతుందట. గత ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం జూలై నుంచి అమలులోకి రావాల్సి ఉంది. ఇందులో భాగంగా 2009 జనవరి 1న తర్వాత జన్మించిన వారికి పొగాకు విక్రయాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా 2023 అక్టోబర్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈ చట్టం రద్దుకు చర్యలు చేపట్టింది అని చెప్పాలి. ఇలా పొగాకు పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతుండగా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే పొగాకు వినియోగానికి బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తామని అటు ప్రభుత్వ వర్గాలు చెబుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: