ఉక్రెయిన్ లో కొత్త గందరగోళం.. జెలెన్ స్కి మాట వినని సైన్యం?

praveen
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం దాదాపు సంవత్సరం నుండి జరుగుతూనే ఉంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ వ్యవస్థ కలిగిన రష్యాతో యుద్ధానికి అటు ఉక్రెయిన్ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయలేదు అని చెప్పాలి. దీనికి కారణం ఇక అగ్రరాజ్యంగా కొనసాగుతున్న అమెరికాయూకే, యూరప్ లాంటి దేశాల నుంచి ఇక ఆయుధ సహకారంతోపాటు ఆర్థిక సహకారం కూడా అందుతూ ఉండడమే ఇక ఉక్రెయిన్ సైనికులు సైతం రష్యా సైనికులతో ఎంతో విరోచితంగా పోరాటం చేశారు.

 ఇలా యుద్ధం కొనసాగుతూ వస్తూ ఉండగా.. ఈ యుద్ధం కారణంగా ఎంతో మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నెలకొంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇక అటు ఉక్రెయిన్ లో మాత్రం గందరగోళ పరిస్థితులు ఉన్నాయి అన్నది తెలుస్తోంది. ఎందుకంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి ఏకంగా ఉక్రెయిన్ సైన్యాధిపతిని మార్చేందుకు సిద్ధమయ్యాడట  అయితే ఏ విషయంపై ఉక్రెయిన్ సైన్యం మొత్తం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల నుంచి ఉక్రెయిన్ కు అందాల్సిన ఆయుధ సహకారంతోపాటు ఆర్థిక సహకారం కూడా దాదాపుగా 90% తగ్గిపోయిందట.

 కనీసం రష్యాతో యుద్ధం చేసేందుకు సరైన ఆయుధ సంపత్తి కూడా ప్రస్తుతం ఉక్రెయిన్ దగ్గర లేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో ఉక్రేయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి మాత్రం ఏకంగా రష్యాతో యుద్ధంలో వైఫల్యాన్ని కారణంగా చూపుతూ ఏకంగా సైన్యాధ్యక్షున్ని మార్చడానికి సిద్ధమయ్యారట. ఇక ఇదే విషయంపై ఏకంగా ఉక్రెయిన్ లోనే ప్రధాన నగరమైన కియూ మేయర్ ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలెన్స్ కి పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక జెలెన్స్ కి నిర్ణయం పై సైన్యం కూడా అసంతృప్తితో ఉండడంతో ఇక అతని ఆదేశాలను కూడా ధిక్కరించేందుకు సిద్ధమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: