ఉలిక్కిపడ్డ ఉక్రెయిన్.. ఊహించని షాక్ ఇచ్చిన జార్జియా?

praveen
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపు ఏడాది గడిచిపోతుంది. అయితే ఇక ఇరుదేశాల సైనికులతో పాటు ఎంతోమంది సాధారణ ప్రజలు కూడా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ వ్యవస్థ కలిగిన రష్యాతో ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం ఎలా యుద్ధం చేసి నిలబడగలదు అని ప్రపంచ దేశాలు ముందుగా భావించాయి. కానీ తమ దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రితోనే ఇన్నాళ్లపాటురష్యాను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వచ్చింది చిన్న దేశమైన ఉక్రెయిన్.

 అటు ఉక్రెయిన్ కి యూరోపియన్ యూనియన్ నుంచి కూడా రహస్యమైన మద్దతు అందుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్ కి ఆయుధాలు కూడా సమకూరుస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇలా యూరప్ దేశాల అండతో రష్యాను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. కానీ ఇప్పుడు ఉక్రెయిన్ కి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి అన్నది తెలుస్తోంది. ఇప్పటికే రష్యాతో పోరాడేందుకు సరైన ఆయుధ సముదాయం లేక గత కొంతకాలం నుంచి వరుస పరాజయాలను ఎదుర్కొంటుంది ఉక్రెయిన్.

 ఇలాంటి సమయం లో యూరప్ దేశాలు షిప్పుల ద్వారా ఉక్రెయిన్ కి ఆయుధాలు సరఫరా చేస్తూ ఉన్నాయి. ఈ క్రమం లోనే రష్యా మిత్ర దేశమైన జార్జియా  ఏకంగా ఉక్రెయిన్ కి ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా ఉక్రెయిన్ కి షిప్ ద్వారా వస్తున్న ఆయుధాలను జార్జియా సీజ్ చేసింది. ఇక ఇలాంటి ఘటన తో ఉక్రెయిన్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇలా భారీ ఆయుధాలతో వస్తున్న షిప్ ని జార్జియా ఫిష్ చేయడం తో మిత్ర దేశమైన రష్యాపై జరిగే అతిపెద్ద దాడిని అడ్డుకుంది అనేది తెలుస్తుంది. ఇక ఈ ఘటన తో ఉక్రెయిన్  షాక్ లో మునిగి పోయింది. ఇక తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: