క్రైమ్ సిరీస్ లు చూసి.. చివరికి ఓ యువతి ఏం చేసిందో తెలుసా?
అయితే సినిమాల విషయంలో అయినా అటు సెన్సార్ బోర్డు కట్టింగులు ఉంటాయి. ఏదైనా అభ్యంతరకరమైన సన్నివేశం ఉంది అంటే చాలు సెన్సార్ బోర్డు సభ్యులు తమ కత్తెరకు పని చెప్పి ఆ సన్నివేశాన్ని తొలగిస్తూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో ఓటీటి హవా పెరిగిపోయింది. ఇక ఎన్నో రకాల వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరిస్తున్నాయ్. అయితే ఓటీటిలో కంటెంట్ కి ఎలాంటి సెన్సార్ లేకపోవడంతో అసభ్యకరమైన కంటెంట్ దగ్గర నుంచి అన్ని రకాల సన్నివేశాలను కూడా వెబ్ సిరీస్లలో పెట్టేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలాంటి వెబ్ సిరీస్ లు అటు ప్రేక్షకులను బాగా ప్రభావితం చేస్తున్నాయ్.
ఇక్కడ ఒక యువతి ఏకంగా వెబ్ సిరీస్ చూసి బాగా ప్రభావితం అయింది. ఎంతలా అంటే ఏకంగా ఒక మహిళను అత్యంత కిరాతకంగా చంపేంతలా. దక్షిణ కొరియాలో ఈ ఘటన జరిగింది. జంగ్ యో జంగ్ అనే 23 ఏళ్ల యువతి క్రైమ్ సిరీస్, నవల్స్ అంటే ఎంతో ఇష్టపడుతూ ఉండేది. ఇలాంటి క్రైమ్ సిరీస్ లు చూసి చూసి ఇక తానే స్వయంగా ఒక మర్డర్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన పుట్టిందట. ఈ క్రమంలోనే తనకు ఇంగ్లీష్ నేర్పించాలంటూ 50 మందిని సంప్రదించింది. చివరికి ఒక మహిళ ఒప్పుకోగా.. ఆమె ఇంట్లోకి అడుగుపెట్టడంతోనే తన దగ్గర ఉన్న కత్తితో ఏకంగా.. 100 సార్లు దారుణంగా పొడుచు చంపింది యువతి. ఈ ఘటనతోనే అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.