ఇవేం ఈదురు గాలులురా నాయనా.. మనుషులనే ఎత్తిపడేసాయ్?
సాధారణంగా ఈదురు గాలులు అంటే చిన్న చిన్న చెట్లు నేల కొరకడం లాంటివి జరుగుతూ ఉంటుంది. కానీ ఏకంగా మనుషులను ఎత్తిపడేసే ఈదురు గాలులు చూడటం మాత్రం చాలా అరుదు అని చెప్పాలి. కానీ ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. అక్కడ భారీ వర్షం కురుస్తుంది. వర్షానికి తోడు భీకరమైన రీతిలో ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయి. ఎంతలా అంటే ఏకంగా మనుషులను ఎత్తిపడేసే రేంజ్ లో. ఇక దీనికి తోడు కర్ణభేరి బద్దలయ్యేలా ఉరుములు ఉరుముతూ ఉండడం గమనార్హం.
ఈ రాకాసి గాలులు, ఉరుములు మెరుపులకు ఏకంగా సౌదీ అరేబియాలో ఎన్నో ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. రోడ్డు పక్కన ఉన్న హోర్డింగులు అన్ని ఒక్కసారిగా విరిగి కింద పడిపోయాయి. అంతేకాదు ఇక జనాలు కూడా ఎగిరిపడ్డారు అని చెప్పాలి. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని తీవ్రభయాందోళనలో గడిపారు అక్కడ జనాలు. ఇక సౌదీ అరేబియాలో ఈదురు గాలులు ఎంత దారుణమైన పరిస్థితులు సృష్టించాయి అన్నదానికి నిదర్శనంగా ఇప్పుడు ట్విట్టర్ వేదికకు ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి నేటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతారు.