తాలిబన్లు మరో షాకింగ్ నిర్ణయం.. అవి కూడా క్లోజ్?
మహిళ అంటే కేవలం వంటింటి కుందేలు మాత్రమే కాదు ఏ రంగంలో అయినా సత్తా చాటగలదు అని అక్కడ ఎంతో మంది మహిళలు నిరూపిస్తున్న సమయంలో.. తాళిబన్లు తీసుకువచ్చిన నిబంధనల కారణంగా వివిధ రంగాలకు చెందిన మహిళలందరూ కూడా ఇంటిపట్టునే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం మహిళలకు స్వేచ్ఛగా చదువుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఇలా తాళిబన్లు తీసుకుంటున్న నిర్ణయాలు అటు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోతున్నాయి.
ఇక ఇప్పుడు తాళిబన్ ప్రభుత్వం మరోసారి ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆఫ్గనిస్తాన్ లో అన్ని బ్యూటీ పార్లర్లను మూసివేయాలి అంటూ తాళిబన్లు ఆదేశాలు జారీ చేశారు. ఇస్లాంలో నిషేధిత సేవలను బ్యూటీ పార్లర్లు అందిస్తూ ఉన్నాయి. దీంతోపాటు పెళ్లి సమయంలో అబ్బాయిలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ తాలిబన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే ఇక దేశవ్యాప్తంగా ఉన్న బ్యూటీ పార్లర్లు మూసివేయాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ నిర్ణయంతో దేశంలో సుమారు 60000 మంది ఉపాధి కోల్పోబోతున్నారు అని చెప్పాలి. అయితే ఈ ఆంక్షలు ఎత్తివేసేందుకు ఆఫ్గనిస్తాన్ అధికారులతో మాట్లాడుతున్నట్లు ఐరాస తెలిపింది. ఏం జరగబోతుందో చూడాలి మరి.