పెళ్లిలో గొడవ.. ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని చంపేశారు?
అయితే అప్పుడప్పుడు సందడిగా సాగుతున్న పెళ్లి మండపం లో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఫుడ్ విషయం లేనో లేకపోతే కట్న కానుకల విషయం లోనూ.. లేదంటే మర్యాదల విషయం లోనూ ఇలా అప్పుడప్పుడు గొడవలు జరగటం చూస్తూ ఉంటాం. అయితే ఇలా గొడవలు జరిగినప్పుడు మాట మాట అనుకోవడం.. ఇక మధ్య లో ఎవరో ఒకరు కలగజేసుకొని ఆ గొడవను సర్దుమనికేలా చేయడం చేస్తూ ఉంటారు. కానీ ఇటీవల పాకిస్తాన్లో జరిగిన ఒక పెళ్లి లో జరిగిన గొడవ లో దారుణం జరిగింది. ఏకంగా పెళ్లిలో జరిగిన గొడవ కారణంగా ఒకే ఫ్యామిలీకి చెందిన తొమ్మిది మందిని కాల్చేశారు.
వాయువ్య పాకిస్తాన్ లోని ఖైబర్ ఫాక్తున్వ ప్రావిన్స్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓకే కుటుంబానికి చెందిన 9 మందిని ఏకంగా పెళ్లికి విచ్చేసిన బంధువులే కాల్చి చంపారు. ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మాలాఖాన్ జిల్లా బత్కేలా తహసీల్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి వివాదమే ఈ హత్యలకు కారణమని పోలీసులు కూడా నిర్ధారించారు. అయితే మృతుల్లో ముగ్గురు మహిళలు ఆరుగురు పురుషులు ఉన్నారట. రంగంలోకి దిగిన పారా మిలిటరీ బలగాలు ఇక అన్ని జిల్లాల సరిహద్దులను మూసివేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.