17 ఏళ్లకు చదువు ఆపేసాడు.. 22 ఏళ్లకు ధనవంతుడయ్యాడు?

praveen
ఒకప్పుడు బాగా చదువుకున్న వారు మంచి ఉద్యోగంలో చేరితేనో లేదా వ్యాపారం ప్రారంభిస్తేనో ఎక్కువగా ఆదాయం సంపాదించడం చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు టెక్నాలజీకి అనుగుణంగానే అటు మనిషి జీవన శైలిలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. దీంతో ఇక నేటి రోజుల్లో ఎక్కువ ఆదాయం సంపాదించడానికి చదువుతో పని లేకుండా పోయింది. కాస్త తెలివి ఉపయోగిస్తే చాలు ఊహించని రీతిలో ఆదాయం సంపాదించవచ్చు అని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు. ఇక్కడ ఒక యువకుడు ఇలాంటిదే చేసి అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు. 17 ఏళ్లకే చదువు తనకు సెట్ కాదని వదిలేసాడు.

 ఆ తర్వాత 22 ఏళ్లకే అతను మిలియన్ ఇయర్ గా మారిపోయాడు అని చెప్పాలి. ప్రస్తుతం ఏం పని చేయకుండా కూర్చుని తిన్న తరగని ఆస్తిని సంపాదించాడు. అతని పేరు హెడేన్ బౌల్స్ 17 ఏళ్ల వయసులోనే చదువును ఆపేసాడు. ఆన్లైన్ కోర్సులను అందించే ఈ Ecommseason విద్యా సంస్థను ప్రారంభించాడు.  అంతే కాదు రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడులు పెట్టాడు. ఇక అక్కడ నుంచి అతని ఆదాయం క్రమక్రమంగా పెరగడం మొదలైంది. సాధారణంగా ఎవరైనా సరే 60 ఏళ్ల తర్వాత రిటైర్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ యువకుడు మాత్రం 22 ఏళ్ళ వయసులో రిటైర్మెంట్ తీసుకున్న.. జీవిత కాలానికి కూర్చుని తిన్న తరగని ఆస్తులను సంపాదించాడు.

 అతను ప్రారంభించిన విద్యా సంస్థ ద్వారా నాలుగు మిలియన్ల సంపద ఇక రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా ఒకటి పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల సంపద వెనకేసుకున్నాడు. ఇక వచ్చిన లాభాలను తన పార్ట్నర్ తో కలిసి పంచుకుంటున్నాడు. 22 ఏళ్ల యువకుడు ఇక ఇప్పుడు ఏకంగా ఖరీదైన లంబోర్ఘిని కారులో తిరుగుతూ ఉన్నాడు అని చెప్పాలి. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అని అడిగితే.. లక్ష్యంతో పని చేయండి.. చేసే పని మీద దృష్టి పెట్టండి.. వచ్చిన దానిని పొదుపు చేయండి అంటూ సలహాలు కూడా ఇస్తున్నాడు ఈ 22 ఏళ్ల యువకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: