వామ్మో.. కాలి గోర్లు అమ్మి.. లక్షలు సంపాదిస్తుంది?
సాధారణంగా వాడి పడేసిన చెత్తను కొనుగోలు చేసేందుకు ఎవరు కూడా ఆసక్తి చూపించరు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం ఏకంగా తన కాలి వేలి గోర్లు అమ్మి లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తుంది అని చెప్పాలి. దీంతో ఆమె గురించి తెలిసి ప్రస్తుతం నేటిజన్స్ అందరూ కూడా షాక్ అయిపోతున్నారు. ఇక ఇక ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. అమెరికాకు చెందిన ఒక మహిళ ఇలా చెత్తను అమ్మి లక్షల రూపాయలు సంపాదిస్తుంది.
నార్త్ కరోలినాకు చెందిన రెబక్కా బ్లూ అనే యువతి మోడల్. ఆమెతో సోషల్ మీడియాలో మంచి పాపులరిటి కూడా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తన పాపులారిటీని క్యాష్ చేసుకుంటూ చెత్తను అమ్మి లక్షలు సంపాదిస్తుంది. తాను వాడి పడేసిన వస్తువులకు డిమాండ్ ఉండడంతో దానిని క్యాష్ చేసుకుంటుంది. మొదట ఆన్లైన్లో సాక్స్ లు, గోర్ల క్లిప్పులు అమ్మిన రెబక్క ఇక ఇప్పుడు కాలి గోర్లతో పాటు ఉమ్మి, కాలి నుంచి కత్తిరించిన చర్మం, చుండ్రుతో పాటు ఇక ఇంట్లో వాడి పడేసిన వస్తువులను కూడా అమ్ముతూ ఉంది అని చెప్పాలి. ఇలా అమ్మడం ద్వారా లక్షల ఆదాయాన్ని సంపాదిస్తుంది అని చెప్పాలి. ఈ విషయం తెలిసి ఇలా కూడా డబ్బులు సంపాదించవచ్చ అని ఎంతోమంది షాక్ అవుతున్నారు అని చెప్పాలి.