తల్లి కోప్పడిందని.. కొడుకు ఏం చేశాడో తెలుసా.. పోలీసులు షాక్?
ఇక ఇలా వెలుగులోకి వచ్చే వాటిలో కొన్ని వింతైన ఘటనలు కూడా ఉంటాయని చెప్పాలి. ఇక ఇలాంటి విషయాల గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. సాధారణంగా తల్లి పై కోపం వచ్చినప్పుడు ఇక పిల్లలు అలగడం లాంటివి చేస్తూ ఉంటారు. రెండు మూడు రోజులు మాట్లాడటం మానేస్తూ ఉంటారు. కానీ తల్లిపై కోపంతో ఇక్కడ పిల్లాడు చేసిన పని మాత్రం ప్రతి ఒక్కరిని అవాక్కేలా చేస్తుంది. ఏకంగా 130 కిలోమీటర్ల వరకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడు సదురు బాలుడు. ఈ ఘటన చైనాలో వెలుగులోకి వచ్చింది.
తల్లి కోపగించుకోవడంతో మనస్థాపం చెందాడు ఆ బాలుడు. ఈ క్రమంలోనే తల్లి పై ఫిర్యాదు చేసేందుకు ఏకంగా తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాలి అనుకున్నాడు. అతనికి కేవలం సైకిల్ తొక్కడం మాత్రమే వచ్చు. దీంతో సైకిల్ పై బయలుదేరి ఏకంగా 150 కిలోమీటర్ల వరకు వెళ్ళాడు. ఇలా రోజంతా సైకిల్ తొక్కుతూ 130 కిలోమీటర్లు వెళ్లిన అమ్మమ్మ ఇల్లు మాత్రం రాలేదు. చివరికి అలసిపోయి రోడ్డు పక్కన కూర్చున్నాడు. ఇది గమనించిన పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించి చివరికి బాలుడిని అప్పగించారు అని చెప్పాలి. ఇక కొడుకు చేసిన పని గురించి తెలిసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.