యుద్ధానికి సిద్ధమైన చైనా.. సరిహద్దులో ఆయుధాల మోహరింపు?
కానీ ఇక ఇప్పుడు బైడెన్ అధ్యక్షుడిగా మారిన తర్వాత మాత్రం అటు తైవాన్‌కు అమెరికా నుంచి అంతంత మాత్రమే మద్దతు ఉండడంతో ఇక చైనా ఆటలకు అడ్డుకట్ట వేసేవారే లేకుండా పోయారు. దీంతో ఇక తైవాన్ సరిహద్దుల వద్ద చైనా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుంది అని చెప్పాలి. దీంతో చైనా ఎప్పుడూ తైవాన్ పై యుద్ధం ప్రకటిస్తుంది అన్నది కూడా తెలియని విధంగానే మారిపోయింది. అదే సమయంలో చైనా తో యుద్ధం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాం. కానీ చైనా ముందు తలవంచ డానికి మాత్రం తామసిద్దంగా లేము అంటూ చిన్న దేశమైన తైవాన్ తెగేసి చెబుతుంది అని చెప్పాలి.
ఇకపోతే తైవాన్ పై యుద్ధం ప్రకటించేందుకు చైనా భారీగా యుద్దనౌకలు, జెట్ పైటర్లను కూడా ఆ దేశ సరిహద్దు ప్రాంతాల్లో మొహరించి ఒక అడుగు ముందుకేసింది అన్నది తెలుస్తుంది. ఇలా మొహరించడం యుద్ధానికి రిహార్సల్స్ అంటూ చైనా పేర్కొంది అని చెప్పాలి. దీంతో చైనా ప్రతీకార చర్యలకు దిగుతుందని తైవాన్ మండిపడుతుంది అని చెప్పాలి. ఇక అయితే ఇటీవల చైనా నుంచి తైవాన్ కు బెదిరింపులు తీవ్రం కావడంతో ఆ దేశ అధ్యక్షురాలు అమెరికాతో సమావేశం అయింది అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ చైనా వెనక్కి తగ్గకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉండడం గమనార్హం.