పాపం టిక్ టాక్.. మరో దేశంలో కూడా బ్యాన్?
ఎక్కడ దొరకని వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ టిక్ టాక్ లో దొరకడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ వాడటం మొదలుపెట్టారు. చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక ఈ యాప్ లోనే గంటలు తరబడి కాలం గడపడం చేశారు అని చెప్పాలి. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం భద్రతా కారణాల దృశ్య భారత ప్రభుత్వం టిక్ టాక్పై నిషేధం విధిస్తు నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. కేవలం టిక్ టాక్ మాత్రమే కాదు చైనాకు సంబంధించిన మిగతా యాప్లకు విషయంలో బ్యాన్ విధించింది భారత ప్రభుత్వం. అయితే ఇక ఇండియా తరహాలోనే మరికొన్ని దేశాలు కూడా టిక్ టాక్ యాప్ ని వరుసగా బ్యాన్ చేస్తూ వస్తూ ఉన్నాయి.
ఇప్పటికే అమెరికా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్ దేశాలు టిక్ టాక్ యాప్ ను బ్యాన్ చేశాయి అన్న విషయం తెలిసిందే. వినియోగదారుల సమాచారాన్ని దొంగలించి చైనా గూడ చర్యం చేస్తుంది అంటూ ఇక ఈ యాప్ పై ఆరోపణలు చేశాయి. ఇక ఇటీవలే మరో దేశం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం భద్రతా కారణాల దృశ్యం టిక్ టాక్ యాప్ ను నిషేధించింది. వ్యక్తిగత దేశ రక్షణకు సంబంధించిన డేటా భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక ఈ నిషేధం త్వరలోనే అమల్లోకి వస్తుంది అంటూ స్పష్టం చేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.