ఓరి నాయనో.. ప్రేమించుకోవడానికి.. విద్యార్థులకు సెలవులు?

praveen
సాధారణం గా యువతి యువకుల మధ్య ప్రేమ పుట్టడం అనేది సహజమే. ఇక కాలేజీకి వెళ్ళినప్పుడు ఇలా యువతి యువకులు ఎంతో మంది ప్రేమ లో మునిగి తేలుతూ ఉంటారు. ఇక ఇటీవల కాలం లో అయితే ఇలాంటి ప్రేమలు మరింత ఎక్కువయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే కాలేజీ రోజుల్లో కాదు ఏకంగా స్కూల్ డేస్ నుంచే ఎంతో మంది ప్రేమలో పడుతున్నారు. వారి మధ్య ఉన్న అట్రాక్షన్ ని ప్రేమ అనుకుంటూ ఇక చదువును అటకెక్కించి చివరికి చెడుదారుల్లో నడుస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

 అయితే కాలేజీల్లో కానీ లేదంటే స్కూల్లో కానీ ఇలా విద్యార్థులు ఎవరైనా ప్రేమలో మునిగి తేలుతున్నారు అంటే ఇలాంటివి తప్పు.. బాగా చదువుకుని సెటిల్ అయిన తర్వాత ప్రేమ జోలికి వెళ్తే బాగుంటుందని పెద్దలు మరోవైపు ఉపాధ్యాయులు కూడా చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదండోయ్ ఏకంగా యువతి యువకులు ప్రేమించుకోవడానికి ప్రత్యేకంగా వారం రోజులపాటు హాలిడేస్ కూడా మంజూరు చేస్తున్నారు. వావ్ ప్రేమించుకోవడానికి సెలవులా.. ఇదేదో బాగుంది అనుకుంటున్నారు కదా. అయితే ఇది మన దేశంలో కాదు భారత పొరుగు దేశమైన చైనాలో.

 చైనాలో జననాల రేటు తీవ్రంగా పడిపోతుంది అన్న విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. జననాల రేటును పెంచేందుకు ఇక కొన్ని కాలేజీలు ఏకంగా విద్యార్థులకు వారం రోజులపాటు లవ్ హాలిడేస్ పేరిట సెలవులు మంజూరు చేస్తున్నట్లు ఇక చైనా మీడియా పేర్కొంది అని చెప్పాలి. ఏప్రిల్ ఒకటి నుంచి ఏడు వరకు ఇలా ప్రేమించుకోవడానికి, రొమాన్స్ కోసం, అంతేకాకుండా ప్రకృతిని ఆస్వాదించడానికి, లైఫ్ పై ఫోకస్ పెట్టడానికి సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ముగ్గురి కంటే ఎక్కువ పిల్లలను కంటే రాయితీ ఇస్తున్నట్లు కూడా అక్కడి ప్రభుత్వం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: