పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టొద్దు.. చట్టం తెచ్చిన ప్రభుత్వం?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం మనదేశంలోనే కాదండోయ్ ఇక పాశ్చాత్య దేశాల్లో అయితే అంతకుమించి అనే రేంజ్ లోనే సోషల్ మీడియా మాయాలో మునిగితేలుతున్నారు జనాలు. వెరసి ఇక నేటి రోజుల్లో మిగతా ప్రపంచం గురించి అవసరం లేకుండా గంటల తరబడి కేవలం సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కూడా ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టి ఇక లైక్ లు సంపాదించాలని ఎంతోమంది ఆశపడుతున్నారు.

 అయితే ఇలా సోషల్ మీడియా లైకుల మాయలో పడిపోతున్న ఎంతోమంది జనాలు.. కొన్ని కొన్ని సార్లు చేయకూడని పనులు కూడా చేస్తూ ఉన్నారు. ఏకంగా పర్సనల్ లైఫ్ ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పదిమందిలో పెట్టేస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలాంటి ట్రెండు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక సోషల్ మీడియా వాడకంపై కొన్ని దేశాల ప్రభుత్వాలు కఠినమైన ఆంక్షలు కూడా విధిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవల ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా సోషల్ మీడియా వాడకం విషయంలో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది అన్నది తెలుస్తుంది.

 అయితే ఇక పిల్లల విషయంలోనే ప్రత్యేకంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చింది ఫ్రాన్స్ ప్రభుత్వం. ఇప్పటినుంచి తల్లిదండ్రులు ఎవరు కూడా తమ పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి వీలు లేదు అంటూ తెలిపింది. ఇలా పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై బ్యాన్ విధించింది. ఒకవేళ రూల్స్ కి విరుద్ధంగా అలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించింది.. పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల చైల్డ్ పోర్నోగ్రఫీకి దారితీస్తున్నాయని.. అంతేకాకుండా పిల్లల ఫోటోలు పోస్ట్ చేసి కొంతమంది తల్లిదండ్రులు ఫాలోవర్స్ తో పాటు డబ్బు సంపాదిస్తున్నారని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: