తాలిబన్లు షాకింగ్ నిర్ణయం.. విడాకులు రద్దు?

praveen
తాలిబన్.. వార్తల్లో ఈ పేరు కనిపించిందంటే చాలు వీళ్లు మళ్లీ ఇంకేం చెత్త నిబంధన తీసుకువచ్చారో అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో తాలిబన్లు తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రజాస్వామ్యాన్ని మంట కలిపి మారనాయుధాలతో అధికారాన్ని చేపట్టిన తాలిబన్లు ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిగా చట్టాలలో కూడా మార్పులు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ప్రజాస్వామ్యంలో ఎంతో స్వేచ్ఛగా బ్రతుకుతున్న మహిళలను మళ్లీ వంటింటి కుందేలుగానే మార్చేశారు..

 వారి చదువులపై ఉద్యోగాలపై కూడా పూర్తిగా నిషేధం విధించారు అని చెప్పాలి. కనీసం క్రీడల్లో కూడా మహిళలకు అవకాశం కల్పించడం లేదు. వెరసి ఇలా తాలిబన్లు మహిళలపై చూపుతున్న వివక్ష ప్రపంచ దేశాలను కూడా షాక్ కి గురి చేస్తూ ఉంది. ఒకరకంగా చెప్పాలంటే మహిళలు అసలు మనుషులే కాదు మగవాళ్లకు బానిసలు అన్నట్లుగానే అటు తాలిబన్లు ఎన్నో చెత్త నిబంధనలు తీసుకువస్తూ ఉన్నారు అని చెప్పాలి  ఇక ప్రపంచం మొత్తం అటు ఆఫ్ఘనిస్తాన్ ను వెలివేస్తున్న కూడా వారి తీరులో మాత్రం ఎక్కడా మార్పు రావడం లేదు.

 ఇక ఇప్పుడు తాలిబన్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు అన్నది తెలుస్తుంది.  మహిళల విడాకులను రద్దు చేస్తున్నట్లు తాలిబన్లు నిర్ణయం తీసుకున్నారట. దీంతో ఇక భర్త చేతిలో వేధింపులకు గురై విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్న మహిళలను.. తిరిగి భర్తల దగ్గరకే వెళ్లాలని ఒత్తిడి కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చట్టపరంగా విడాకులు తీసుకున్న వారికి కూడా.. మళ్లీ భర్తల దగ్గరకు వెళ్లాలని తాలిబన్ కమాండర్లు ఆదేశాలు జారీ చేస్తున్నారట. ఒకరకంగా చెప్పాలంటే భర్తల నుంచి వేధింపులు తాళలేక విడాకులు తీసుకున్న వారిని మళ్లీ భర్తల దగ్గరకే వెళ్లి వేధింపులు భరించాలని తాలిబన్లు చెప్పకనే చెబుతున్నారు అన్నది మాత్రం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: