రష్యాకు భారీ దెబ్బ.. ట్విస్ట్ ఇచ్చిన జెలెన్ స్కి?

praveen
ఒక నెల కాదు రెండు నెలలు దాదాపు ఏడాది కాలం నుంచి కూడా ఉక్రెయిన్ రష్యా మధ్య భికర స్థాయిలో యుద్ధం జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు ఇరుదేశాల మధ్య దాడులు కాస్త తగ్గాయి అనుకునే లోపే రష్యా బీకరమైన దాడులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతుంది. ఇక ఈ దాడులలో భారీగా ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది అని చెప్పాలి. అదే సమయంలో అటు చిన్న దేశం అయినప్పటికీ ఉక్రెయిన్ రష్యాకు వెన్ను చూపకుండా వీరుచితంగా పోరాటం చేస్తుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే అటు ఉక్రెయిన్ కూడా ఎన్నోసార్లు మెరుపు దాడులకు పాల్పడుతూ రష్యా కు షాక్ ఇస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ రష్యాలోని విద్యుత్ సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్ చేస్తూ వరుసగా ఎయిర్ స్ట్రైక్ కి పాల్పడుతుంది అని చెప్పాలి. ఇక పాశ్చాత్య దేశాల సహాయంతో ఇలా రష్యాను ఎంతో దీటుగా ఎదుర్కొంటుంది ఉక్రెయిన్. ఈ క్రమంలోనే ఇక ఇరుదేశాల మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో అటు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇటీవల ఆయన తీసుకున్న నిర్ణయం అయితే మరింత సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

 బెలారస్, రష్యాలకు  చెందిన 102 కంపెనీలను బ్లాక్ చేయడంతో పాటు ముగ్గురు వ్యక్తులపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు జెలెన్ స్కి. ఈ క్రమంలోనే  ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా, బెలారస్ ఆస్తులను పూర్తిగా బ్లాక్ చేస్తున్నట్లు తెలిపారు. వాటిని మా రక్షణ కోసం వినియోగించబోతున్నాం అంటూ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రకారం అయితే.. వస్తువుల రవాణా, వాహనాల లీజింగ్, రసాయన ఉత్పత్తిలో ఉన్న సంస్థలపై ఇక ఇటీవలే ఉక్రెయిన్ ప్రభుత్వం తీసుకున్న ఆంక్షలు ఉండబోతున్నాయి.   పొటాష్ ఉత్పత్తిదారు బెలారస్కాలి, బెలారసియన్ రైల్వేలు, రష్యాకు చెందిన వీటీబీ-లీజింగ్, గాజ్‌ప్రోమ్‌ బ్యాంక్ లీజింగ్ వంటి సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి అని చెప్పాలి. ఈ సంస్థల్ని బ్లాక్ చేయడం.. రష్యాపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: