మితిమీరిన తాలిబన్ల రూల్స్.. ఏకంగా బొమ్మలకు కూడా?

praveen
ఆఫ్ఘనిస్తాన్ లో అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాక్షసత్వ పాలన సాగిస్తున్న తాళిబన్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది అని చెప్పాలి. రోజురోజుకు వింతైన విచిత్రమైన నిబంధనలను తెరమీద తెస్తూ ఇక ప్రజలందరినీ కూడా స్వేచ్ఛ లేని బానిసలుగా మార్చుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమకు ఎదురు తిరిగిన వారిని చంపేయడం ఇక తమకు జేజేలు కొట్టిన వారిని క్షమించి వదిలేయడం లాంటివి చేస్తూ ఉన్నారు అనిచెప్పాలి. ఇలా తాలిబన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి.

 ఇక ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించి ఏదో ఒక ఘటన తరచూ వెలుగు లోకి వస్తూనే ఉంది అని చెప్పాలి. అంతేకాదు ఇక చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వారిని సైతం బహిరంగంగా దారుణంగా శిక్షిస్తూ ఉన్న ఘటనలు కూడా ప్రపంచ దేశాలను నివ్వరపోయేలా చేస్తున్నాయని చెప్పాలి. అయితే ఇప్పటికే మహిళలు చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి వీలులేదని.. ఇక ఇంటి గడప దాటకుండా నిబంధనలను తీసుకువచ్చారు తాళిబన్లు. కేవలం మహిళలకు మాత్రమే కాదు అమ్మాయిల బొమ్మలకు కూడా ఇలాంటి నిబంధనలను తీసుకొచ్చారు అని చెప్పాలి

 సాధారణం గా బట్టల షాపుల లో ఇక మహిళల దుస్తులను డెమో బొమ్మలకు వేసి ఇక షాపు బయట పెట్టి ఆ కస్టమర్ దృష్టిని ఆకర్షించాలని అందరూ అనుకుంటారు. అయితే ఆఫ్గనిస్తాన్లో మాత్రం ఇలా చేయడానికి అవకాశం లేదు. ఏకంగా డెమో బొమ్మల ముఖాలు కూడా కప్పి ఉంచాలి అని అటు షాపు యజమానులకు తాళిబన్ ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఇకనుంచి ఆఫ్ఘనిస్తాన్ లో ప్రతి బట్టల షాపు లో కూడా డెమో బొమ్మల ఫేస్ లను కప్పి ఉంచేందుకు అటు వ్యాపారులు కూడా సిద్ధమయ్యారు. ఇక తాళిబన్లు తీసుకున్న ఈ నిర్ణయం  మాత్రం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: