తాలిబన్ పాలనలో.. తొలిసారి అలాంటి శిక్ష?

praveen
ప్రజాస్వామ్యాన్ని మంట కలిపి రాక్షస పాలన సాగించేందుకు ఆయుధాలు చేతపట్టి ఎన్నో ప్రాణాలను తీసి అధికారాన్ని చేపట్టారు తాలిబన్లు. అయితే తాము మునుపటిలా కాదని పూర్తిగా మారిపోయామని ప్రజలకు సుపరిపాలన అందిస్తాము అంటూ ఎన్నో మాయమాటలు చెప్పారు ఎవరిపై ఆంక్షలు విధించబోము అంటూ కల్లబొలి మాటలు చెప్పి జనాలను నమ్మించేందుకు ప్రయత్నించారు. కానీ ఇక పూర్తిగా ఆఫ్గనిస్తాన్ పాలనను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత మాత్రం ఊహించిన రీతిలో తాళిబన్లు తమ నిబంధనలతో సంచలనం  సృష్టించారు అని చెప్పాలి  ఈ క్రమంలోనే ఏకంగా దారుణమైన శిక్షలు విధిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తాలీబన్ల పాలన ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 అంతేకాదు మహిళలను కేవలం వంటింటి బొమ్మలుగా మాత్రమే మార్చిన తాలీబన్ల.. ఉద్యోగాలు మాన్పించి కేవలం ఇంటికి మాత్రమే పరిమితం చేశారు. ఏ ప్రొఫెషన్ లో కూడా మహిళలు కొనసాగకూడదు అని నిబంధనలు పెట్టారు అన్న విషయం తెలిసిందే. కనీసం మహిళలు చదువుకోడానికి కూడా అవకాశం కల్పించలేదు. అంతేకాదు ఇక ఎవరైనా తప్పు చేస్తే బహిరంగ ఉరిశిక్షలు విధించడం లాంటివి కూడా చేస్తాము అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆఫ్గనిస్తాన్లో తాలీబన్ల అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి ఏకంగా ఒక వ్యక్తికి బహిరంగంగా ఉరిశిక్ష అమలు చేశారు. ఇది కాస్త ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 2017లో ఒక వ్యక్తిని పొడిచి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇక తాలీబన్లు అధికారంలోకి రాకముందు వరకు కూడా కోర్టుల్లో విచారణకు హాజరవుతూ వస్తున్నాడు. అయితే తాలీబన్లు ప్రస్తుతం అధికారంలోకి వచ్చి ఇక తమ పాలన కొనసాగిస్తున్న సమయంలో ఇలా హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బహిరంగ ఉరిశిక్ష విధించారు. దీనికి ఆ దేశ న్యాయమూర్తి ఉప ప్రధానితో సహా మంత్రులు అందరూ కూడా హాజరు కావడం గమనార్హం. 1996 నుంచి 2001 వరకు తాలీబన్లు అధికారంలో ఉన్న సమయంలో ఇలా ఎవరైనా నేరానికి పాల్పడితే నిందితులను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: