గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. స్మశానంలో డ్యూటీ ఎక్కిన యువతి?

praveen
సాధారణంగా పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఎవరైనా సరే ఇక మంచి కంపెనీలో ఉద్యోగం సాధించి లక్షల జీతం సంపాదించాలని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మంచి ఉద్యోగం దొరికేంతవరకు కూడా ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా కొన్నిసార్లు ఇంటర్వ్యూ కు వెళ్ళినప్పుడు టాలెంట్ ఉన్నప్పటికీ కేవలం రికమండేషన్ ఉన్న కాండిడేట్లకు మాత్రమే జాబ్ దొరకడంతో నిరాశలో మునిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటివి ఎంతో మంది నిరుద్యోగుల విషయంలో ఎన్నోసార్లు జరిగే ఉంటాయి.

అయితే ఒకప్పుడు మాత్రమే ఇలా ఉండేది. బాగా చదివిన వారు మంచి ఉద్యోగం చేయాలి అనే అందరూ భావించేవారు. కానీ ఇటీవల కాలంలో మంచి చదువులు చదివిన వారు సైతం తమకు నచ్చిన ప్రొఫెషన్ లోకి అడుగుపెడుతూ ఇక లక్షల రూపాయలు సంపాదిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ సోషల్ మీడియాలో  వైరల్ గా మారిపోయిన న్యూస్ మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ యువతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అందరీ లాగా పెద్దపెద్ద కంపెనీలో జాబ్ కోసం ప్రయత్నించలేదు.

 ఏకంగా స్మశాన వాటికలో పనిచేయడం మొదలుపెట్టింది యువతి.  దీంతో ఇక ఆ యువతి గురించి తెలిసి ప్రస్తుతం అందరూ షాక్ అవుతున్నారు. చైనాకు చెందిన 22 ఏళ్ల టాన్ అనే యువతి ఉద్యోగం చేసే ఆఫీస్ లో రాజకీయాలకు భయపడి చాంగ్ కింగ్ లోని పర్వత ప్రాంతంలో ఉన్న స్మశాన వాటికలో పనిచేస్తుంది. ఇక ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు సదరు యువతి స్వయంగా సోషల్ మీడియాలో తెలిపింది. ప్రతిరోజు ఆరు గంటలు పని చేసినందుకుగాను నెలకు 50వేల రూపాయలు సంపాదిస్తుందట సదరు యువతీ. ఇక ఈ విషయం తెలిసి నేటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: