గబ్బిలాల పులుసు తిన్న యువతి.. చివరికి ఏం జరిగిందంటే?

praveen
మొన్నటి వరకు కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కరోనా వైరస్ విజృంభన నైపద్యంలో అటు ప్రజలు మొత్తం ప్రాణాలను అరిచేతిలో పట్టుకుని బ్రతికారు అని చెప్పాలి.  అయితే ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించిన కరోనా వైరస్ కేవలం గబ్బిలాల కారణంగా మాత్రమే మనుషులకు సోకింది అని పలువురు శాస్త్రవేత్తలు కూడా వెల్లడించారు. అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి కూడా ప్రతి ఒక్కరు ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉంటున్నారు. ఏది పడితే అది తినకుండా కేవలం సాంప్రదాయమైన ఆహారాన్ని తినడానికి మాత్రమే ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి.

 కానీ ఇప్పటికి చైనా, థాయిలాండ్ దేశాలలో ప్రమాదకరమైన విషయాన్ని కూడా బేకాతరు చేస్తూ ఇక ఇష్టం వచ్చిన ఆహారాన్ని తింటూ ఉన్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. చిత్రవిచిత్రమైన జంతువులను పక్షులను కూడా ఆహారంగా మార్చుకుంటున్నారు. ఇక్కడ ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా ఓ యువతి కరోనా వైరస్ రావడానికి కారణమైన గబ్బిలాలను తినడం హాట్ టాపిక్ గా మారిపోయింది. గబ్బిలాలతో కూడిన ఒక బ్యాట్ సూప్ తాగుతూ ఎంతో రుచిగా ఉంది అంటూ సదరు యువతి వర్ణించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది .

 ఇక ఈ విషయం ఫేస్బుక్లో వైరల్ గా మారిపోవడంతో వెంటనే థాయిలాండ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇక గబ్బిలాల పులుసును తిన్న ఆ యువతిని పోలీసులు అరెస్టు చేశారు అని చెప్పాలి. పొంచెనోక్ శ్రీసునక్లువ అనే యువతీ ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ తో పాటు ఫేస్బుక్లో కూడా ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ పోస్ట్ చేసింది. ఇలా నెటిజెన్స్ ని ఆకర్షించడానికి గబ్బిలాల పులుసు తిన్న యువతి చివరికి జైలు పాలు కావడంతో.. ఇలాంటివి అవసరమా అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: