ఓరినాయనో.. సిగరెట్ తాగుతూ.. 42 కిలోమీటర్లు పరిగెత్తాడు?
సాధారణంగా సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని అందరూ చెబుతూ ఉంటారు. సిగరెట్ తాగడం వల్ల అటు ఊపిరితిత్తులు పాడై చివరికి శ్వాసకోశ సంబంధ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉంటారు. అంతేకాదు సిగరెట్ తాగుతూ వేగంగా నడవడం, పరిగెత్తడం కూడా ప్రాణాలకే ప్రమాదం అయి అంటూ ఉంటారు వైద్యులు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఇలాంటిదే చేసి అందరిని అవాక్కయ్యలా చేస్తూ ఉన్నాడు. సిగరెట్ తాగుతూ వేగంగా నడవడం కాదు ఏకంగా పరుగులు పెట్టాడు.
అది కూడా ఏదో కొద్ది దూరం అనుకుంటే మాత్రం పొరపాటే ఏకంగా సిగరెట్ నోట్లో పెట్టుకుని తాగుతూనే 42 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఇక ఈ ఆశ్చర్యకరమైన ఘటన చైనాలో వెలుగులోకి వచ్చింది. 50 ఏళ్ల చెన్ అనే వ్యక్తి అరుదైన రికార్డులను నెలకోల్పాడు. సిగరెట్ తాగుతూ 42 కిలోమీటర్లు పరిగెత్తి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక మొత్తం మారథాన్ మూడు గంటల 28 నిమిషాల్లో పూర్తి చేశాడు సదరు వ్యక్తి. అయితే మొత్తం 1500 మంది రేసులో పాల్గొనగా ఇతనొక్కడే సిగరెట్ తాగుతూ పరిగెట్టడం మొదలుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక గతంలో 2018, 2019లో కూడా అతను ఇలా సిగరెట్ తాగుతూనే రన్నింగ్ పోటీలలో పాల్గొన్నాడు.