చెత్తబుట్టలో పడేసిన కాగితంతో.. కోట్లు సంపాదించింది?

praveen
లక్ష్మీదేవి కటాక్షం రావాలని ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కేవలం కొంతమందికి మాత్రమే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారిపోవడం లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో ఎంతోమంది డబ్బు సంపాదించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటే ఇంకొంతమంది మాత్రం ఎంతో సులభంగా లాటరీ టికెట్ల ద్వారా అదృష్టం కలిసి వచ్చి రాత్రికి రాత్రి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తరచూ వైరల్ గా మారిపోతూనే ఉన్నాయి అని చెప్పాలి.

 ఇక ఇలాంటి తరహా ఘటనలు చూసినప్పుడు ఇంత గొప్ప అదృష్టం మనకెందుకు రావడం లేదబ్బా అని నెటిజెన్లు అందరూ అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే అదృష్టం మన వెంటే ఉంటే ఎలాంటి సిచువేషన్ లో అయినా సరే అనుకూల వాతావరణం ఉంటుంది అన్నదానికి నిదర్శనం గా ఇక్కడ జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఎంతోమంది ఇటీవల కాలంలో లాటరీ టికెట్ కొనుగోలు చేసి చివరికి డబ్బులు గెలుచుకోలేక నిరాశ పడిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక మహిళకు డస్ట్ బిన్ లో దొరికిన కాగితమే కోట్ల రూపాయలను తెచ్చిపెట్టింది.

 అమెరికాకు చెందిన 60 ఏళ్ల జాక్వలిస్ లేహ్ అనే మహిళకు ఒక లాటరీ టికెట్ రూపంలో జాక్పాట్ తగిలింది. ఆమె ఒక స్టోర్ నుంచి నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. దీనికోసం ఐదు డాలర్లు వెచ్చించింది. అయితే ప్రతి టికెట్కు అదృష్టం వరించదు కదా అని భావించి లాటరీ టికెట్ చెత్తబుట్టలో పడేసింది. కానీ ఎందుకు అదృష్టాన్ని చేజేతులార పోగొట్టుకోవడం  అని భావించి మళ్లీ చెత్త బుట్టలో నుంచి లాటరీ టికెట్ తీసి భద్రపరిచింది. చివరికి ఆమెవద్దు అనుకొని చెత్త బుట్టలో  పడేసిన ఆ కాగితమే రెండు లక్షల డాలర్లు గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఆమె స్పందిస్తూ పారేద్దాం అనుకున్న లాటరీ టికెట్ వల్ల అదృష్టం వరించిందని ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు అంటూ సంతోషం వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: