అమెరికా వదిలి వెళ్ళిన హెలికాప్టర్ వాడిన తాలిబన్లు.. కానీ చివరికి?

praveen
ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్ సైనికులు గుడారాలు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఎన్నో ఏళ్ల పాటు అండర్ గ్రౌండ్ లో ఉండిపోయారు తాలిబన్లు.  ఇక  అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో అమెరికన్ సైనికులు అందరూ కూడా చివరికి తమ దేశానికి ప్రయాణం అవుతున్నారు అని తెలిసిన మరుక్షణం నుంచి ఆఫ్ఘనిస్థాన్లో మళ్లీ తమ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం మారణహోమం సృష్టించారు అన్న విషయం తెలిసిందే.  అడ్డు చెప్పిన వారి ప్రాణాలను దారుణంగా తీస్తూ చివరికి ఆఫ్ఘనిస్థాన్లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత కాలంలో తాలిబన్లు తీసుకువచ్చిన  ఎన్నో నిబంధనలు అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యానికి గురి చేసాయి అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన సాగిస్తున్న తాలిబన్లు తమ సైన్యాన్ని మరింత బలపరచుకోవాలని అని భావిస్తూ ఉండడం గమనార్హం.

 గతంలో యూఎస్ మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్ సైన్యంలో పనిచేసిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఇక తాలిబన్లు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం ఉండటం కారణంగా ఈ విషయంపై సీరియస్గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాగా అమెరికా సైనిక దళాలు వెళ్తూవెళ్తూ వారి ఆయుధాలను హెలికాప్టర్లను ఆఫ్ఘనిస్థాన్లో  ఉన్న వారి స్థావరాల లోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే వెళ్ళే క్రమంలో ఇక ఆయా ఆయుధాలతో ఉన్న హార్డ్వేర్ ద్వంసం చేశారు. కాగా తాలిబన్  ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాలిబన్ ఫైటర్లు అమెరికా దళాలు వదిలివెళ్లిన ఆయుధాలను హెలికాప్టర్లను వాడుతుండటం గమనార్హం.

 అత్యాధునిక టెక్నాలజీతో కూడిన అమెరికన్ హెలికాప్టర్లను వాడటం అటు కొన్ని కొన్ని సార్లు తాలిబన్ ఫైటర్లకు రావడం లేదు అన్నది తెలుస్తుంది.  ఇటీవలే ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమెరికా వదిలివెళ్లిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ తో తాలిబన్ శిక్షణ విన్యాసాలు చేపట్టింది. చివరికి ఆ హెలికాప్టర్ కుప్పకూలి పోవడం గమనార్హం. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్లు  అక్కడి రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది.  ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కాస్తా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: