ఇంట్లోనే కృత్రిమ గర్భం దాల్చిన మహిళ.. ఖర్చు ఎంతో తెలుసా?
అయితే కృత్రిమ గర్భధారణ అనేది ఇన్ వివో ఫలదీకరణం ద్వారా జరుగుతూ ఉంటుంది. స్త్రీ గర్భాశయం కుహరంలోకి విర్యానీ ఇంజెక్ట్ చేయడంతో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందట. అయితే దీనిని కేవలం అనుభవజ్ఞులైన వైద్యులు మాత్రమే చేస్తారట. అంతేకాదు ఇక ఈ చికిత్సకు కూడా కాస్త ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది అని తెలుస్తుంది. ఇకపోతే ఇటీవలే ఒక మహిళ కేవలం నాలుగు వేల రూపాయల కంటే తక్కువ ధర తో డిఐవై కిట్టు తో ఇంట్లోనే కాన్పు చేసుకుంది. అమెరికాకు చెందిన బెయిలీ ఎన్నిస్ అనే మహిళ తల్లి కావాలి అని భావించి ఆమెకు ఇంకా పెళ్లి కాకపోవడం గమనార్హం.
అయితే తనకు ఒక మగతోడు కావాలన్న ఆసక్తి లేదు. కానీ తల్లి కావాలని ఆశ మాత్రం ఆమె లో పుట్టింది. దీని కోసం ఆమె డీ ఐ వై పద్ధతిని ఎంచుకుంది. ఈ క్రమంలోనే ఎటువంటి వృత్తిపరమైన సహాయం లేకుండా గర్భధారణ పొందడం గమనార్హం. తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసి ఇటీవల 2.32 కిలోల బరువు ఉన్న ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ ప్రక్రియ ద్వారా మొదటి ప్రయత్నంలోనే గర్భం ధరించడం అనేది దాదాపు అసాధ్యం అంటున్నారు వైద్య నిపుణులు. కానీ ఒకవేళ అలా జరిగింది అంటే మాత్రం అదృష్టవంతులు అని చెబుతున్నారు..