వైరల్ : అమ్మో భారీ కొండచిలువ.. వ్యాన్ ను చుట్టేసింది?

praveen
కొండ చిలువ.. ఈ పేరు చెబితే చాలు ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఒక్కసారి కొండ చిలువ దాడి చేసింది అంటే చాలు దాని నుంచి తప్పించు కోవటం దాదాపు అసాధ్యం అని చెప్పాలి.  అమాంతం మనిషిని మింగేస్తూ తనకు ఆహారంగా మార్చుకుంటూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమం లోనే కొండ చిలువ ఎలా వేటాడుతుంది అన్న దానికి సంబంధించిన వీడియోలు ఇప్పటివరకు సోషల్ మీడియా లో ఎన్నో సార్లు వైరల్ గా మారి పోయాయ్. ఇక ఇలాంటి వీడియోలు చూసి అవాక్కవడం ప్రతి ఒక్కరి వంతు అవుతుంది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.

 ఇక ఇప్పుడూ కొండచిలువ కు సంబంధించిన మరో వీడియో కూడా సోషల్ మీడియా  లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు అందరూ కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి. ఇంత భారీ కొండ చిలువను ఎప్పుడూ చూడలేదు అంటూ కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం. ఇంతకీ వీడియో లో ఏముందంటే ఒక మారుమూల ప్రాంతం  లో ఒక వ్యాన్ చుట్టు  పక్కల పార్కింగ్ చేసి ఉంది. ఈ క్రమంలోనే ఒక భారీ కొండచిలువ ఆ వ్యాను చుట్టుకుని నలిపేస్తూ ఉంది మ్ ఇది చూసిన ఎంతో మంది షాక్ కి గురి అవుతున్నారు అని చెప్పాలి.

 అయితే ఆ వ్యాన్ చుట్టూ ఉన్న జనం కొండచిలువను చూస్తూ ఉండిపోయారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి కొంతమంది నెటిజన్లు అవాక్కవుతు ఉంటే.. ఇది ఫేక్ వీడియో అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటివి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలానే పుట్టుకొస్తున్నాయి అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు అని చెప్పాలి. ఏది ఏమైనా కొండచిలువ కు సంబంధించిన వీడియో మాత్రం వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: