స్లీప్ వాక్.. 5వ అంతస్తు నుంచి కింద పడిన యువతి.. చివరికి?

praveen
స్లీప్ వాక్.. అదేనండి నిద్రలో నడక.. ఈ విషయం గురించి ఎంతో మంది విని చూసి ఉంటారు. అయితే నిజ జీవితంలో ఇది చూసిన వారి కంటే సినిమాల్లో చూసిన వారే ఎక్కువగా ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ఎంతోమంది కమెడియన్స్ కి స్లీప్ వాక్ చేసే అలవాటు ఉన్నట్లు చూపిస్తూ ఉంటారు. ఇలా స్లీప్ వాక్ అలవాటు ఉన్నవారు నిద్ర లో నడుస్తూ ఎన్నో సరదా పనులు చేయడం లాంటివి కూడా ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. అయితే నిజ జీవితంలో ఇలా నిద్రలో నడిచే వారు చాలా తక్కువ మందే ఉంటారు అని చెప్పాలి. కొంతమంది మాత్రమే ఇలాంటి రుగ్మతతో బాధపడుతున్నారు.

 అయితే సినిమాల్లో కమెడియన్స్ చేసే స్లీప్ వాక్ అందరిని కడుపుబ్బా నవ్వుకునేలా చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం నిజజీవితంలో స్లీప్ వాక్ ఒక కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. నిద్రలో నడిచే అలవాటు ఉన్న కారణంగా చివరికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు అనే చెప్పాలి. నిద్రలో నడుస్తూ ఐదవ అంతస్తు వరకూ తనకు తెలియకుండానే వెళ్ళిన ఒక మహిళ చివరికి 5వ అంతస్తు నుంచి కిందపడి తీవ్రగాయాలతో మృత్యువాత పడింది. ఈ ఘటన జర్మనీలో వెలుగులోకి వచ్చింది.

 న్యూ బ్రాండెన్ బర్గ్ లో ఉండే 18 ఏళ్ల యువతి ఇలా నిద్రలో నడుస్తూ బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయిన ఘటన కాస్త స్థానికంగా సంచలనం గా మారిపోయింది. అయితే నిద్రలో నడిచే అలవాటు ఉన్నా యువతి రోజు లాగానే నిద్రలోకి జారుకున్న తర్వాత నడవడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే  ఐదవ అంతస్తులో ఉన్న ఓ కిటికీ తెరిచింది. దీంతో ఆ కిటికీ లో నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడింది సదరు యువతి. అయితే ఒక వ్యక్తి గుర్తించి వెంటనే ఆసుపత్రికి సమాచారం అందించాడు. ఇక వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికి అప్పటికే తీవ్ర గాయాలు అయ్యి రక్తస్రావం కావడంతో ప్రాణాలు వదిలింది యువతి. అయితే అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: