పాక్ లో 68 మంది మృతి.. ఇండియాలాగే అక్కడ కూడా?

praveen
గత కొంత కాలం నుంచి భారత్ లో వర్షాలు ఎంతలా కుండ పోతగా కురుస్తున్నాయో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఒక రేంజ్ లో దంచి కొడుతున్నాయ్ వానలు. ఈ క్రమం లోనే ఇక అన్ని రాష్ట్రాలు భారీ వరదల  తో అతలా కుతలమవుతున్నాయి అని చెప్పడం లో అతి శయోక్తి లేదు. ఈ క్రమం లోనే ఇక ఎన్నో ప్రాంతాలు నీట మునిగి పోయి ఇక ప్రజలు దీనావస్థలో కి చేరుకున్నారు.

 అయితే ఇలా భారత్ లో కురిసిన కుండపోత వర్షం కారణం గా వచ్చిన వరదల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే వర్షాలు మొదలై రోజులు గడుస్తున్నాయి. వాతావరణ శాఖ అధికారులు మాత్రం వర్షాలు తగ్గుతాయి అన్న వార్త చెప్పడం లేదు. మరో మూడు రోజులు, మరో రెండు రోజులు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం లో ప్రస్తుతం దేశ వ్యాప్తం గా ప్రజలందరూ కూడా భయాందోళనలో మునిగి పోతున్నారు అని చెప్పాలి. అయితే మన దేశంలోనే కాదు భారత శత్రువు దేశమైన పాకిస్తాన్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది అన్నది తెలుస్తుంది.

 పాకిస్తాన్ లోని ఎన్నో ప్రాంతాలలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక భారీ వర్షాలకు నదులు వరదలతో పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్లోని సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే అకస్మాత్తుగా వరదలు రావడంతో వందలాదిగా ప్రజలు కొట్టుకుపోయారు అనేది తెలుస్తుంది. వరదల కారణంగా 68 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. నీటి ప్రవాహం లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలుచేపట్టారు అక్కడ సిబ్బంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: